మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ వసూలు చేయటాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు మరోసారి విచారణ చేపట్టింది. మారటోరియంలో వడ్డీ ఎలా వసూలు చేస్తారని వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు మారటోరియం విధించి ప్రయోజనమేంటని కేంద్రాన్ని అత్యన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
ఈ విషయంపై మూడు రోజుల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐలు సంయుక్త సమావేశం నిర్వహించి.. వడ్డీ వసూలు చేయాలా వద్దా? అనే నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ విషయంపై ఆర్థిక శాఖ, ఆర్బీఐ అధికారులతో చర్చించి అఫిడవిట్ దాఖలు చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఇందుకు కాస్త సమయం కావాలని కోరారు. జూన్ 17న తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది.
ఇదీ చూడండి:ఉద్యోగుల్లో కరోనా భయాలకు ఇన్ఫీ సాంకేతిక పరిష్కారం!