ETV Bharat / business

కరోనా ఎఫెక్ట్: యూపీఐ లావాదేవీల్లో క్షీణత.. కానీ!

నగదు రహిత లావాదేవీలకు అవకాశం కల్పించే యూపీఐపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో రూ. 20 లక్షల కోట్ల మేర ట్రాన్సాక్షన్లు తగ్గినట్లు యూపీఐని నియంత్రించే ఎన్​పీసీఐ సంస్థ గణాంకాలు విడుదల చేసింది. అయితే రూ.లక్షకు మించి నగదు బదిలీ చేసే అవకాశం ఉన్న ఆర్​టీజీఎస్​కు గత నెల రోజుల్లో ఆదరణ పెరిగిందని స్పష్టం చేసింది.

author img

By

Published : Apr 21, 2020, 12:51 PM IST

corona effect on upi
కరోనా ఎఫెక్ట్: యూపీఐ లావాదేవీల్లో క్షీణత..కానీ!

దేశంలో నగదు రహిత లావాదేవీలు అందిస్తోన్న యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్​ఫేస్)పై కరోనా ప్రభావం పడింది. ఈ మేరకు జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్​పీసీఐ) గణాంకాలు వెల్లడించాయి. ఐఎంపీఎస్ విధానం ద్వారా పనిచేసే యూపీఐ ద్వారా ఏ బ్యాంకుకైనా తక్షణమే నగదు బదిలీ చేసేందుకు అవకాశం ఉంది.

మార్చిలో రూ. 20 లక్షల కోట్లు..

ఫిబ్రవరిలో 132.57 కోట్ల లావాదేవీలు చేసిన యూపీఐ మార్చి నెలలో 128.68 కోట్ల ట్రాన్సాక్షన్లు మాత్రమే నమోదు చేయగలిగిందని గణాంకాలు వెల్లడించాయి. లావాదేవీల విలువ ఫిబ్రవరిలో రూ. 2.23 లక్షల కోట్లు ఉండగా.. మార్చిలో రూ. 2.06 కోట్లకు తగ్గిందని పేర్కొన్నాయి. అయితే ఏప్రిల్​లో జరిగిన లావాదేవీల సమాచారం అందితేనే వాస్తవంగా ప్రతికూల ప్రభావం ఎంతనేది తెలుస్తుందని స్పష్టం చేశాయి.

ఐఎంపీఎస్​లోనూ క్షీణత

ఐఎంపీఎస్ లావాదేవీల్లో కూడా తగ్గుదల నమోదైందని ఎన్​పీసీఐ గణాంకాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరిలో రూ.24.78 కోట్ల లావాదేవీలు ఐఎంపీఎస్ ద్వారా జరగగా.. మార్చిలో ఆ సంఖ్య 21.68కి పడిపోయిందని వెల్లడించాయి. ఈ లావాదేవీల విలువ ఫిబ్రవరిలో రూ. 2.14 కోట్లుగా ఉందని.. మార్చిలో రూ. 2.01 కోట్లకు పడిపోయిందని స్పష్టం చేశాయి.

ఆర్​టీజీఎస్​కు పెరిగిన ఆదరణ..

లాక్​డౌన్​ కారణంగా రూ. లక్షకు మించి నగదు రహిత లావాదేవీలు చేసేందుకు అవకాశం ఉన్న ఆర్​టీజీఎస్​కు ఆదరణ అమాంతం పెరిగినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో 34 శాతం ఎక్కువగా ఆర్​టీజీఎస్ లావాదేవీలు నమోదైనట్లు వెల్లడించాయి.

ఫిబ్రవరిలో ఆర్​టీజీఎస్​ల ద్వారా జరిగిన ట్రాన్సేక్షన్లు రూ. 89.9 లక్షల కోట్లు కాగా మార్చిలో ఆ మొత్తం రూ. 120.47 కోట్లుగా నమోదైంది.

ఐఎంపీఎస్ ద్వారా ఎల్లప్పుడు నగదు బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎన్​పీసీఐ. మొబైల్, ఇంటర్నెట్, ఏటీఎం, ఎస్ఎంఎస్, బ్యాంక్, యూఎస్​ఎస్​డీ ద్వారా బ్యాంకుల మధ్య నగదు బదిలీ చేసేందుకు వీలు కల్పిస్తోంది. అయితే ఇందులో పరిమిత మొత్తాన్ని మాత్రమే బదిలీ చేసుకునేందుకు వీలు ఉండగా.. ఆర్​టీజీఎస్​ ద్వారా రూ. లక్షకు మించి లావాదేవీలకు అవకాశం ఉంది. ఆర్​టీజీఎస్ బ్యాంకు సెలవు దినాల్లో పనిచేయదు.

ఇదీ చూడండి: 'అమ్యూజ్‌మెంట్‌ పార్కుల పరిశ్రమను ఆదుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.