సంవత్సరం చివరి నాటికి సెట్ టాప్ బాక్స్ పోర్టబిలిటీ అమలయ్యే అవకాశం ఉన్నట్లు టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) అంచనా వేస్తోంది. దీని కోసం ఆచరించదగిన పరిష్కారాన్ని పరీక్షిస్తున్నట్లు తెలిపింది ట్రాయ్.
వినియోగదారులు ప్రస్తుతం సెట్ టాప్ బాక్స్ కొనుగోలు చేసినట్లయితే ఆపరేటర్ మారటానికి అవకాశం లేదు. వేరే ఆపరేటర్‌కు మారాలంటే మరో సెట్ టాప్ బాక్స్ కొనుగోలు చేయాల్సిందే. దీనివల్ల పాతది నిరుపయోగంగా ఉండటంతో పాటు ఎలక్ట్రానిక్ చెత్త పోగవుతోంది.
పోర్టబిలిటీ కోసం వివిధ భాగస్వామ్య సంస్థలు, పరిశ్రమ వర్గాలతో కలిసి పనిచేస్తోంది ట్రాయ్.
వర్క్‌షాప్...
గురువారం నాడు ట్రాయ్ ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించింది. దీనికి డీటీహెచ్ ఆపరేటర్లు, మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు, సెట్ టాప్ బాక్స్ తయారిదార్లు తదితరులు హాజరయ్యారు.
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నుంచి తెలుసుకున్న ఆనుభవాల దృష్ట్యా సెట్ టాప్ బాక్స్ పోర్టబిలిటీ పోటీని పెంచుతుంది. ఇది దీర్ఘ కాలంలో పరిశ్రమకు మంచి చేస్తుంది. - ట్రాయ్
ఇదీ చూడండి: భారీగా పెరగనున్న ఆన్లైన్ వీడియో వీక్షకులు