భారత్-అమెరికా మధ్య వాణిజ్య విభేదాలు చాలా వరకు తగ్గాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య త్వరలోనే ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ ధ్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు వార్షిక సదస్సుకు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు నిర్మల.
" ఈ విషయం(అమెరికాతో ఒప్పందం)పై వాణిజ్యశాఖ పనిచేస్తోంది. చర్చలు త్వరలోనే ఓ కొలిక్కివస్తాయని అనుకుంటున్నా. చర్చలు జరుగుతున్న తీవ్రత నాకు తెలుసు. కొన్ని అసమానతలను గుర్తించాం. త్వరలోనే ఒప్పందం కుదురుతుందని నమ్మకం ఉంది."
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి.
వేగంగా వృద్ధి చెందుతోంది..
ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కలవరపెడుతున్నప్పటికీ.. వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని తెలిపారు నిర్మలా సీతారామన్. వృద్ధిని వేగవంతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత వృద్ధి రేటును తగ్గించినప్పటికీ.. వేగంగా వృద్ధి సాధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఎయిర్ ఇండియాకు ఇంధన సరఫరా కొనసాగింపు!