ETV Bharat / business

బిట్​కాయిన్​ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది? - క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి

ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా హాట్​టాపిక్​గా మారిన అంశాల్లో బిట్​కాయిన్ కూడా ఒకటి. ఎందుకంటే దీని విలువ రోజురోజుకు కొత్త రికార్డు స్థాయిను తాకుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ విలువ 45 వేల డాలర్ల పైనే ఉంది. మరి ఈ క్రిప్టోకరెన్సీకి ఎందుకు ఇంత డిమాండ్​? బిట్​కాయిన్​లో పెట్టుబడి సురక్షితమేనా? బిట్​కాయిన్ వ్యవస్థ ఎలా పని చేస్తుంది? దీనిని ఎవరైనా నియంత్రిచగలరా? అనే సందేహాలకు సమాధానాలు మీ కోసం.

Is Bitcoin Investing Safe
బిట్​కాయిన్ పెట్టబడి సురక్షితమేనా
author img

By

Published : Feb 12, 2021, 3:07 PM IST

బిట్​కాయిన్​.. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఎక్కువ మంది చర్చించుకుంటున్న విషయాల్లో ఇదీ ఒకటి. ఒక బిట్​కాయిన్​ విలువ ఇప్పుడు 45,000 డాలర్లపైనే ఉంది. గత ఏడాది డిసెంబర్​లోనే తొలిసారి 20 వేల డాలర్ల మార్క్​ దాటిన బిట్​కాయిన్.. రెండు నెలల్లోనే 45 వేల డాలర్లపైకి చేరడం విశేషం.

విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ ఇటీవల 1.5 బిలియన్​ డాలర్లు బిట్​కాయిన్​లో పెట్టుబడులు పెట్టడం కూడా బిట్​ కాయిన్​ విలువ ఈ స్థాయికి చేరేందుకు కారణం.

భారత్ విషయానికొస్తే.. క్రిప్టోకరెన్సీకి సంబంధించి త్వరలో బిల్లును తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ వెల్లడించారు. రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు.

'ఇప్పుడున్న చట్టాలకు క్రిప్టోకరెన్సీతో వస్తోన్న సమస్యలను పరిష్కరించే సామర్థ్యం లేదు. అంతేకాదు ఆర్​బీఐ, సెబీ లాంటి నియంత్రణ సంస్థలకు కూడా క్రిప్టో కరెన్సీ వల్ల ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి చట్టపరమైన అధికారాలు లేవు. అందుకే కొత్త బిల్లును తీసుకురావాలనుకుంటున్నాం. బిల్లు తుది రూపు దాల్చింది. కేబినెట్​ ఆమోదానికి పంపడమే మిగిలింది.' అని వివరించారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో చాల మందిలో క్రిప్టోకరెన్సీపై అనేక అనుమానాలు మొదలయ్యాయి. అలాంటి సందేహాలన్నింటికీ 'ఈటీవీ భారత్​' అందిస్తున్న సమాధానాలు మీ కోసం.

ఏమిటీ క్రిప్టోకరెన్సీ?

క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్​ (వర్చువల్) కరెన్సీ. ఇవి ప్రత్యేక సాఫ్ట్​వేర్​ కోడ్​ల ద్వారా పని చేస్తుంటాయి. సాధారణ కరెన్సీలు (రూపాయి, డాలర్​ వంటివి) భౌతికంగా చలామణి అవుతుంటాయి. క్రిప్టో కరెన్సీలు మాత్రం భౌతికంగా కనిపించవు, వాటిని ముట్టుకోలేం. ఇవి పూర్తిగా డిజిటల్​ రూపంలో మాత్రమే ఉంటాయి.

పేరుకు తగ్గట్లుగానే.. క్రిప్టోగ్రఫీ, బ్లాక్​ చైన్​ సాంకేతికతలు క్రిప్టోకరెన్సీకి మూలాధారాలు.

ప్రస్తుతం బిట్​కాయిన్​, ఇథీరియం, స్టెల్లార్, రిపుల్, డాష్​​ సహా పలు ఇతర క్రిప్టోకరెన్సీలు మనుగడలో ఉన్నాయి. వీటన్నింటిలో బిట్​కాయిన్​ అత్యంత ఆధరణ పొందిన క్రిప్టో కరెన్సీ.

బ్లాక్​ చైన్ టెక్నాలజీ అంటే ఏమిటి?

క్రిప్టోకరెన్సీ ప్రస్తావన వచ్చినప్పుడు.. మనం చాలా సార్లు క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్, బ్లాక్​ చైన్ సాంకేతికత గురించి వింటూనే ఉన్నాం.

బ్లాక్​చైన్​ అనేది డేటా బైస్​ ఆధారంగా పని చేసే ఓ ప్రత్యేక సాంకేతికత. ఇందులో సమాచారం అనేది బ్లాకులుగా విభజన చెంది.. అదంతా ప్రపంచవ్యాప్తంగా వేరువేరు సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది.

ఇలా ఒక సర్వర్​కు మరో సర్వర్​ అనుసంధానమై ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఈ కారణంగా బ్లాక్ చైన్ రూపంలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని ఎంతటి హ్యాకర్లయినా తస్కరించడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే క్రిప్టోకరెన్సీలను ఎవరూ నియంత్రించడం కూడా జరగదు. దీనితో పాటు అవి అత్యంత సురక్షితమనే వాదన కూడా ఉంది.

బిట్​కాయిన్​ పొందడం ఎలా?

బిట్​కాయిన్​ను వర్ణించాలంటే డిజిటల్​ గోల్డ్​గా చెప్పవచ్చు. ఎందుకంటే.. బిట్​ కాయిన్​, బంగారం రెండూ అంత సులభంగా దొరకవు. వాటిని వెలికి తీయాలంటే.. చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొనాలంటే భారీగా ఖర్చవుతుంది.

బంగారం భౌతికంగా భూమిలో ఉంటుంది. దీన్ని పొందేందుకు మైనింగ్ చేయాల్సి ఉంటుంది. అదే తరహాలో కొత్త బిట్​కాయిన్ల కోసం.. కంప్యూటర్ల ద్వారా మైనింగ్ చేయాల్సి ఉంటుంది.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఎంతో క్లిష్టమైన క్రిప్టోగ్రఫీ సమస్యలను పరిష్కరించడం ద్వారా కొత్త బిట్​కాయిన్​లను రివార్డుగా పొందొచ్చు. చలామణిలోకి (డిజిటల్​గా) వచ్చే బిట్​కాయిన్​ల సంఖ్య పెరిగే కొద్ది.. కొత్త సమస్యలు పరిష్కరించే వారికి రివార్డుగా వచ్చే కాయిన్లు తగ్గుతాయి. ఇదే సమయంలో పరిష్కరించాల్సిన సమస్యలు మరింత క్లిష్టంగా మారుతుంటాయి. ఒకానొక దశ తర్వాత కొత్త బిట్​కాయిన్​లు ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. మొత్తం మీద 2.1 కోట్ల బిట్​కాయిన్​లు మాత్రమే మనుగడలో ఉంటాయి.

ఇప్పటి వరకు ఇలా 1.85 కొత్త బిట్​కాయిన్​లు చాలామణిలోకి (డిజిటల్​గా) వచ్చాయి. ఇంకా 25 లక్షల కాయిన్లు మాత్రమే చలామణిలోకి రావాల్సి ఉంది.

బిట్​కాయిన్​ రూపకర్త ఎవరు?

బిట్​కాయిన్​ జపాన్​కు చెందిన షాతోషీ నాకామోటో అనే టెకీ రూపొందించినట్లు ప్రచారంలో ఉంది. అయితే దీనిపై స్పష్టత లేదు. 2009లో బిట్​కాయిన్​ మనుగడలోకి వచ్చింది. రూపాయికి 100 పైసలు ఎలానో.. ఒక బిట్​కాయిన్​కు 100 షాతోషీలు ఉంటాయి.

ప్రస్తుతం బిట్​కాయిన్​ల విలువ భారీగా పెరిగిన కారణంగా ఒక బిట్​కాయిన్ కొనడం చాలా కష్టం. అలాంటి వారు షాతోషీలనూ లేదా.. అందులో కొంత భాగాన్ని కొనుగోలు చేయడం ద్వారా కూడా పెట్టుబడి పెట్టొచ్చు.

ఇండియాలో బిట్​కాయిన్​లపై పెట్టుబడులు పెట్టడం చట్టబద్ధమేనా?

క్లుప్తంగా చెప్పాలంటే.. చట్టబద్ధమే. బిట్​కాయిన్ ట్రేడింగ్​పై భారత్​లో నిషేధం లేదు. కానీ క్రిప్టోకరెన్సీని నియంత్రించేందుకు ఎలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ లేదు. క్రిప్టోకరెన్సీ నియంత్రణకు విధివిధానాలు రూపొందించాలని 2019 ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు.

కాబట్టి, క్రిప్టోకరెన్సీలపై ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలాంటి చట్టాలు అతిక్రమించకుండా ఉండటం ముఖ్యం. ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు లేవు కాబట్టి ఏదైనా వివాదాలు తలెత్తితే.. ప్రభుత్వం నుంచి సహాయం లభించదు.

భారత్​లో బిట్​కాయిన్ కొనుగోలు, అమ్మకాలు ఎలా?

బిట్​కాయిన్ల కొనుగోలు/అమ్మకానికి భారత్​లో పలు ఎక్స్ఛేంజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వాజిర్ ఎక్స్, కాయిన్​స్విచ్, జెబ్​పే, కాయిన్​డీసీఎక్స్​ ముఖ్యమైనవి. ఈ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ ఖాతా తీసిన తర్వాత క్రిప్టోకరెన్సీలపై పెట్టుబడులు పెట్టొచ్చు.

ఈ ఎక్స్ఛేంజీలను ప్రభుత్వం నియంత్రిస్తుందా?

భారత్​లోని క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు ఏ ప్రభుత్వ నియంత్రణ ఫ్రేమ్​వర్క్ కిందకు రావు. భారత్​లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీటికి లైసెన్సులు సైతం అవసరం లేదు. ప్రస్తుతం ఇవన్నీ స్వీయ-నియంత్రణ సంస్థ(ఎస్ఆర్ఓ) ఫ్రేమ్​వర్క్​ అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

బిట్​కాయిన్ ట్రేడింగ్ అకౌంట్ తెరిచేందుకు ఏ పత్రాలను సమర్పించాలి?

చట్టబద్ధమైన క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలన్నీ దాదాపుగా ఒకే తరహా సమాచారాన్ని సేకరిస్తాయి. బ్యాంక్ ఖాతా, కేవైసీ వివరాలతో పాటు మొబైల్ నెంబర్​తో బిట్​కాయిన్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కేవైసీ వెరిఫికేషన్ కోసం ఆధార్ లేదా పాన్​ కార్డులలో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతా నుంచి నగదును ట్రేడింగ్ అకౌంట్​కు బదిలీ చేసుకోవచ్చు.

బిట్​కాయిన్ పెట్టుబడి లాభాలపై పన్ను ఎంత చెల్లించాలి?

ఇన్వెస్టర్​లైతే.. భారత్​లో తమ బిట్​కాయిన్ పెట్టుబడి లాభాలపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి. ఒకవేళ బిట్​కాయిన్ అమ్మకం, కొనుగోళ్లే ప్రధాన కార్యకలాపాలై ఉంటే.. వ్యాపారాలపై విధించే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు పన్ను అధికారులతో వివరాలను పంచుకుంటాయా?

క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల వద్ద కస్టమర్ల వివరాలు, కొనుగోళ్లు-అమ్మకాల రికార్డులన్నీ ఉంటాయి. ఒకవేళ పన్ను అధికారులు వీటిని తమతో పంచుకోవాలని కోరితే.. ఈ సమాచారం ఇస్తారు. దీనర్థం బిట్​కాయిన్​పై పెట్టుబడులు పెట్టే వారి సమాచారం ఆదాయ పన్ను శాఖ వద్ద ఉండే అవకాశం ఉంది.

బిట్​కాయిన్ విలువ ఎందుకు అంతగా పెరుగుతోంది?

గత పదేళ్ల వ్యవధిలో బిట్​కాయిన్ బెస్ట్ పెర్ఫార్మింగ్ అసెట్​గా నిలిచింది. ఇన్వెస్టర్లు దీన్ని ద్రవ్యోల్బణం నుంచి రక్షణగా భావిస్తున్నారు. చాలా కార్పొరేట్ సంస్థలు, సంస్థాగత పెట్టుబడిదారులు క్రిప్టోకరెన్సీలపై దృష్టిసారిస్తున్నారు. ఇన్వెస్ట్​మెంట్ పోర్ట్​ఫోలియోను వైవిధ్యంగా మార్చుకోవడం కోసం బిట్​కాయిన్లపై అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు.

బిట్​కాయిన్ విలువ అస్థిరంగా ఉండటానికి కారణం?

బిట్​కాయిన్ మార్కెట్ ఇతర మార్కెట్లతో పోలిస్తే చాలా చిన్నది. ఉదాహరణకు లార్జ్​ క్యాప్ షేర్లతో పోలిస్తే.. చిన్న, మధ్య తరహా షేర్లు ఎక్కువ ఒడుదొడుకులకు లోనవుతాయి. ఇదే బిట్​కాయిన్లకూ వర్తిస్తుంది. ప్రస్తుతం ఏ చిన్న వార్తైనా బిట్​కాయిన్ ధరలపై ప్రభావం చూపుతోంది. ఒక్కసారి మార్కెట్ స్థాయి, వర్తక పరిణామం పెరిగితే ఈ సమస్య ఉండదు.

ప్రముఖ క్రిప్టో కరెన్సీలు..

క్రిప్టోకరెన్సీవిలువ (డాలర్లలో)ఎం-క్యాప్​ (బి. డాలర్లలో)
బిట్​కాయిన్​46,743870.59
ఇథీరియం1,808207.22
టీథర్​130.33
కార్నడో0.809225.18
ఎక్స్​ఆర్​పీ0.527523.95
బినాన్స్​ కాయిన్​145.9722.56
పోల్కాడాట్‌24.3622.13
లిట్​కాయిన్​19212.76
చైన్​లింక్28.110.95

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.