ETV Bharat / business

ప్రపంచ వాణిజ్యంపై 'సూయిజ్​' దెబ్బ! - సూయిజ్​ కాలువలో చిక్కుకున్న ఎవర్​గివెన్ షిప్​ అప్​డేట్స్

సూయిజ్​ కాలువలో ఇరుక్కుపోయిన రాకాసి ఓడ 'ఎవర్​ గివెన్​' వల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఐరోపా దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా పడనున్నట్లు విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగా పలు వస్తువులు ధరలు పెరగొచ్చని కూడా అంచనా వేస్తున్నారు.

Ever green Ship in Suez Canal
సూయిజ్​ కాలువలో చిక్కుకున్న
author img

By

Published : Mar 29, 2021, 5:51 PM IST

కరోనా వల్ల సరఫరా వ్యవస్థకు ఇప్పటికే తీవ్ర అంతరాయం ఏర్పడగా.. ఈజిప్టులోని సూయిజ్​ కాలువలో భారీ వాణిజ్య నౌక చిక్కుకున్న కారణంగా ప్రపంచ వాణిజ్యంపై మరింత ఒత్తిడి పెరుగుతోంది.

సూయిజ్​ కాలువలో అడ్డంగా ఇరక్కుపోయిన 'ఎవర్​ గివెన్​' నౌకను నీటిపై తేలియాడేలా చేసేందుకు.. టగ్‌బోట్లు, ఇతర సహాయక బృందాలు ఎంత ప్రయత్నిస్తున్నా.. పరిస్థితులు మళ్లీ ఎప్పుడు సాధారణ స్థితికి చేరుతాయో తెలియని పరిస్థితి.

గతంలో జపాన్​కు చెందిన ఓ వాణిజ్య నౌక కూడా ఇలానే కొన్ని వారాల పాటు ఇరుక్కుపోయి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ప్రభావం కొన్ని వారాలే కానీ..

ఎవర్​ గివెన్ నౌక ఇరుక్కుపోవడం వల్ల ఏర్పడిన అంతరాయం ప్రపంచ వాణిజ్యంపై కొన్ని వారాలకన్నా ఎక్కువగా ఉండకపోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇది ప్రపంచార్థికాన్ని కూడా అంతగా ప్రభావితం చేయకపోవచ్చని అంటున్నారు. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ప్రజలు కరోనా టీకా వేయించుకోనుండటం, ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభమవుతుండటం ఇందుకు కారణంగా వివరిస్తున్నారు.

అయితే కంపెనీలు సప్లయి చైన్​పై మాత్రమే అధారపడితే ఇబ్బంది తప్పదనే విషయాన్ని ఈ పరిస్థితులు మరోసారి స్పష్టం చేస్తున్నాయని మిల్కెన్ ఇన్​స్టిట్యూట్​ ముఖ్య ఆర్థికవేత్త విలియం లీ పేర్కొన్నారు. ఫ్యాక్టరీల అడ్డాగా ఉన్న చైనాలో.. కరోనా విజృంభణ వల్ల గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని గుర్తు చేశారాయన. సప్లయి చైన్​ అంతరాయం వల్ల వివిధ అసెంబ్లీ యూనిట్ల మూసివేతకు కూడా దారితీయొచ్చని అభిప్రాయపడ్డారు.

చాలా ఓడలు ఇప్పటికే సూయిజ్​ కాలువకు ప్రత్యామ్నాయ మర్గాలు వెతుక్కుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ప్రత్యామ్నాయాల వల్ల కంటైనర్లు గమ్యస్థానాలకు చేరడం, అక్కడి నుంచి మళ్లీ ఇతర ప్రాంతాలకు సరకు రవాణా చేయడంకోసం చాలా సమయం పడుతుందని.. దీనితో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయని అంటున్నారు. ఫలితంగా ఆ ప్రభావం తుది వినియోగదారుడిపైనా పడుతుందని విశ్లేషిస్తున్నారు. దీని వల్ల కంటైనర్ల కొరత కూడా ఏర్పడుతుందని విశ్లేషిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం వాణిజ్యంలో ప్రస్తుతం 12 శాతం సూయిజ్​ కాలువ ద్వారానే జరుగుతోంది. షిప్పింగ్​ కంటైనర్ల విషయంలో 30 శాతం దీనికే వినియోగమవుతున్నాయి. ఓ అంచనా ప్రకారం.. గత ఏడాది 19000 వేల ఓడలు సూయిజ్​ గుండా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించాయని తెలిసింది.

వీటిపై భారం..

సూయిజ్​ కాలువలోని ఈ అంతరాయం వల్ల అంతర్జాతీయంగా దాదాపు 10 శాతం ముడి చమురు షిప్మెంట్స్​, 8 శాతం లిక్విడ్​ నాచురల్ గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడొచ్చని అని అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్​ అడ్మినిస్ట్రేషన్​ పేర్కొంది. పశ్చిమాసియా నుంచి ఐరోపా, అమెరికాకు.. రష్యా నుంచి ఆసియా దేశాలకు ముడి చమురు రవాణాలో ఇది చాలా కీలకమైన మార్గంగా ఉందని వెల్లడించింది.

ఐరోపాతో పోలిస్తే.. ఉత్తర, లాటిన్ అమెరికాల్లో ఈ ప్రభావం కాస్త తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఆసియా మధ్య వాణిజ్య ఓడలు ఎక్కువగా పసిఫిక్​ మహా సముద్రం మీదుగా ప్రయాణించడం ఇందుకు కారణంగా చెబుతున్నారు.

ఇదీ చదవండి:పెట్రోల్​ రేట్లు తగ్గుదలకు అడ్డుపడిన 'రాకాసి ఓడ'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.