ETV Bharat / business

రాష్ట్రాల జీఎస్​డీపీ 14.3% వరకు లాక్​'డౌన్​'! - లాక్​డౌన్​ ప్రభావం ఏ రాష్ట్రంపై ఎంత

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై కరోనా లాక్​డౌన్ తీవ్ర ప్రభావం చూపినట్లు ఇండియా రేటింగ్స్, రీసెర్చ్​ నివేదికలో తేలింది. లాక్​డౌన్​ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల జీఎస్​డీపీ 14.3 శాతం వరకు క్షీణించొచ్చని అంచనా వేసింది.

lockdown impact on states gsdp
రాష్ట్రాల ఆర్థిక స్థితిపై లాక్​డౌన్ దెబ్బ
author img

By

Published : Jun 29, 2020, 5:23 PM IST

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​ ప్రభావం రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల స్థూల రాష్ట్రీయోత్పత్తి (జీఎస్​డీపీ) 1.4 శాతం నుంచి 14.3 శాతం వరకు క్షీణించొచ్చని ఇండియా రేటింగ్స్, రీసెర్చ్​ నివేదిక అంచనా వేసింది.

అసోం, గోవా, గుజరాత్​, సిక్కిం వంటి రాష్ట్రాలు రెండంకెల వృద్ధి రేటు క్షీణత నమోదు చేయొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది నివేదిక.

రాష్ట్రాల వారీగా..

కర్ణాటక, ఝార్ఖండ్, తమిళనాడు, కేరళ, ఒడిశాపై అధికంగా.. మధ్యప్రదేశ్, పంజాబ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్​ప్రదేశ్​లపై తక్కువగా లాక్​డౌన్​ ప్రభావం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

ఏ రంగంపై ఎంత ప్రభావం

వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగపై లాక్​డౌన్​ ప్రభావం భిన్నంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు.. వ్యవసాయంపై తక్కువ ఆధారపడే రాష్ట్రాలతో పోలిస్తే.. వ్యవసాయ కార్యకలాకపాల పరంగా తక్కువగా ప్రభావితం అయినట్లు నివేదిక పేర్కొంది.

బ్యాంకింగ్, ఫినాన్సియల్, సేవ, ఐటీ, ఐటీ ఆధారిత రంగాలపై కూడా లాక్​డౌన్​ ప్రభావం పాక్షికంగానే పడినట్లు నివేదిక అభిప్రాయపడింది. డిజిటల్ సాంకేతికతతో ఈ రంగాల్లో కార్యకలాపాలు సాగించేందుకు ఎక్కువ అవకాశాలు ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది.

ఆదాయానికి గండి..

లాక్​డౌన్​ కారణంగా రాష్ట్రాలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గినట్లు నివేదిక పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రభావం ఇంకా పెరిగొచ్చని అంచనా వేసింది.

పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గే రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్​, తమిళనాడు, కేరళ, తెలంగాణ, హరియాణా ప్రధానంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

ఇదీ చూడండి:టిక్​టాక్​కు 'స్వదేశీ' సవాల్​- దూసుకెళ్తున్న చింగారీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.