ప్లాట్ఫార్మ్, గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత ప్రయోజనాలను అందించనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వీరికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వారికి ఆరోగ్య, ఆర్థిక, ఆహార విషయాల్లో లబ్ధి చేకూర్చేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని తెలిపారు. 2021 బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన నిర్మల ఈ వ్యాఖ్యలు చేశారు.
ఊబర్, ఓలా, స్విగ్గి, జొమాటో వంటి ఈ-కామర్స్ వ్యాపారాల వేదికగా పని చేసే వారిని గిగ్, ప్లాట్ఫార్మ్ వర్కర్లు అని అంటారు. వీరితో పాటు స్వతంత్ర కాంట్రాక్టర్లు, ఆన్లైన్ వేదికల్లో పనిచేసే కాంట్రాక్టర్లు, భవన నిర్మాణాల్లో పనిచేసే వారికి కూడా సామాజిక భద్రత ప్రయోజనాలు అందించనున్నట్టు నిర్మల పేర్కొన్నారు.
దేశంలో 50కోట్లమంది ఇందులో పని చేస్తున్నారు. వీరిలో 40కోట్ల మంది అసంఘటిత రంగానికి చేందిన వారే. ఈ రంగంలోని వారికి జీతాలు సరిగా అందని కారణంగా పీఎఫ్, పింఛను వంటి సామాజిక భద్రతకు దూరంగా ఉన్నారు.
ఇదీ చూడండి:- సీనియర్ సిటిజన్లకు ఐటీ రిటర్నుల నుంచి విముక్తి