ఆర్థిక లక్ష్యాల కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసి కృషి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో సార్వత్రిక బడ్జెట్‌కు ముందు నిర్వహించిన సమావేశంలో రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు మంత్రి. ఆర్థిక వృద్ధికి కేంద్రం దిశా నిర్దేశం చేస్తుందని.. అందులో రాష్ట్రాలు భాగస్వామ్యం కావాలని కోరారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్రం కలిసికట్టుగా కృషి చేస్తే తప్ప లక్ష్యాలను చేరుకోలేమని సీతారామన్ ఉద్ఘాటించారు. రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు పూర్తి మద్ధతు ఉంటుందని వెల్లడించారు.
కేంద్రం నుంచి రాష్ట్రాలకు అసాధారణ స్థాయిలో నిధులు అందుతున్నాయని.. అది ఇటీవలి కాలంలో రూ.8,29,344 కోట్ల నుంచి రూ. 12,38,274 కోట్లకు పెరిగిందని సీతారామన్ పేర్కొన్నారు.
13వ ఆర్థిక కమిషన్‌లో 32 శాతంగా ఉన్న రాష్ట్రాల పన్నుల వాటా, రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని 14వ ఆర్థిక కమిషన్‌లో 42 శాతానికి పెంచినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'ఎఫ్ఎండీ వ్యాక్సిన్లకు బయోవెట్ రూ. 200 కోట్లు'