ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కాంగ్రెస్ విమర్శించింది. ఎగుమతులు, స్థిరాస్తి రంగాలకు ప్రోత్సాహం కల్పించేందుకు ప్రకటించిన రూ. 70 వేల కోట్ల ప్యాకేజీ ఎందుకూ సరిపోదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ.
"నేను ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భారత ఆర్థిక మంత్రికి స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆర్థిక వ్యవస్థ సరిగా నడిచేందుకు ఒక సమగ్ర ప్యాకేజీ అవసరం."
-ఆనంద్ శర్మ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించిన ఉద్దీపనల అనంతరం పరిస్థితి మరింత క్షీణించిందని... తాజా నిర్ణయాలు ఏ విధంగా సహాయపడలేవని పేర్కొన్నారు ఆనంద్ శర్మ.
ఇదీ చూడండి: రూ.70వేల కోట్ల ప్యాకేజీతో ఎగుమతులు, స్థిరాస్తికి ఊతం