ETV Bharat / business

చక్రవడ్డీ మాఫీతో రూ.2 వేల కోట్ల భారం!

author img

By

Published : Apr 4, 2021, 1:35 PM IST

కరోనా నేపథ్యంలో రుణాలపై విధించిన మారటోరియం కాలానికి చక్రవడ్డీ మాఫీతో ప్రభుత్వ రంగ బ్యాంకులపై రూ.2 వేల కోట్ల వరకు భారం పడొచ్చని అంచనాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో మారటోరియం కాలానికి రుణాలపై చక్రవడ్డీ, అపరాధ వడ్డీల మాఫీ తప్పనిసరైంది.

interest waiver impact on PSU Banks
వడ్డీ మాఫీతో బ్యాంకులపై భారం ఎంత

మారటోరియం కాలంలో రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశంతో.. ప్రభుత్వ రంగ బ్యాంకులపై రూ.1,800-2,000 కోట్ల భారం పడొచ్చని తెలుస్తోంది.

2020 మార్చి-ఆగస్టు మధ్య విధించిన మారటోరియం వ్యవధిలో అపరాధ వడ్డీ, చక్ర వడ్డీ వంటివి విధించడానికి వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం గత నెల తీర్పునిచ్చింది. ఇప్పటికే ఇలాంటి మొత్తాలు వసూలు చేసి ఉంటే వాటిని వాపసు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. తదుపరి వాయిదాల్లోనైనా ఆ మేరకు సర్దుబాటు చేయాలని సూచించింది.

రూ.2 కోట్లకుపైగా రుణాలకూ వర్తించేలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంతకన్నా తక్కువ మొత్తంలో రుణాలకు గత ఏడాదే చక్రవడ్డీ మాఫీ చేసింది ప్రభుత్వం. దీని వల్ల రూ.5,500 కోట్ల భారం పడినట్లు వెల్లడించింది. మారటోరియం వినియోగించుకోని వారికి మాఫీని వర్తింపజేసినట్లు వివరించింది.

కార్పొరేట్ రుణాల విషయంలో ఇలా..

బ్యాంకింగ్ వర్గాల ప్రకారం.. మొదట 60 శాతం మంది రుణగ్రహీతలు మారటోరియం సదుపాయాన్ని వినియోగించుకున్నారు. క్రమంగా ఆ సంఖ్య 40 శాతానికి తగ్గింది. అయినప్పటికీ లాక్​డౌన్​ కారణంగా తిరిగి చెల్లింపులు పెద్దగా పుంజుకోలేదు.

కార్పొరేట్​ రుణాల విషయంలో.. 25 శాతం మాత్రమే మారటోరియం సదుపాయాన్ని వినియోగించుకున్నారు. సుప్రీం తీర్పుతో మారటోరియం వినియోగించుకున్న కాలానికి.. చక్రవడ్డీ మాఫీ చేయనున్నాయి బ్యాంకులు.

ఇదీ చదవండి:మారటోరియం కాలానికి చక్రవడ్డీ వసూలు నిషిద్ధం: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.