ETV Bharat / business

'భారత వృద్ధి రేటు ఈ ఏడాది 5.2 శాతమే!'

కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 2020లో 5.2 శాతానికే పరిమితం కావచ్చని ఎస్​&పీ గ్లోబల్​ రేటింగ్స్​ అంచనా వేసింది. వైరస్ ప్రభావం రోజురోజుకు ఎక్కువవుతున్న కారణంగా ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితికి దగ్గరవుతున్నట్లు తెలిపింది.

india growth rate
భారత వృద్ధి రేటు ఆందోళనకరం
author img

By

Published : Mar 18, 2020, 12:24 PM IST

కరోనా వైరస్​ ప్రపంచదేశాలను వణికిస్తున్న వేళ ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ఈ కారణంగా ప్రపంచమంతా ఆర్థిక మాంద్యానికి చేరువవుతున్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొవిడ్ 19​ నేపథ్యంలో భారత వృద్ధి రేటును దిగువకు సవరిస్తూ నివేదిక విడుదల చేసింది ఎస్​&పీ గ్లోబల్​ రేటింగ్స్​. ఈ ఏడాది దేశ ఆర్థిక వృద్ధి రేటు 5.2 శాతానికే పరిమితం కావచ్చని తాజా అంచనాల్లో తెలిపింది.

ఇంతకు ముందు 2020లో భారత్ 5.7 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఎస్​&పీ అంచనా వేయడం గమనార్హం.

మాంద్యం భయాలు పెరుగుతున్నాయ్​..

ఇదే సమయంలో ఆసియా-పసిఫిక్​ ప్రాంతంలో​ ఆర్థిక వృద్ధి రేటు 3 శాతానికన్నా తక్కువగా నమోదు కావచ్చని అంచనా వేసింది ఎస్​&పీ. కరోనా కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చైనాలో నెలకొన్న పరిస్థితులు, అమెరికా, ఐరోపాల్లో మూసివేతలు, వైరస్​ వ్యాప్తి వంటి పరిణామాలు ఈ ప్రాంతంలో మాంద్యం భయాలు పెంచుతున్నట్లు పేర్కొంది.

ఆ దేశాలకూ ఆందోళనే..

చైనా, జపాన్​ వృద్ధి రేటు అంచనాలను 2020కి గాను 2.9 శాతం, -1.2 శాతానికి తగ్గించింది ఎస్​&పీ గ్లోబల్​ రేటింగ్స్. ఇంతకు ముందు అ దేశాల వృద్ధి రేటు అంచనాలు 4.9 శాతం, -0.4 శాతంగా ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి:కార్యాలయాల స్థలాలకు పెట్టుబడుల వెల్లువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.