రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్(ఆర్టీజీఎస్) సేవలు సోమవారం (డిసెంబర్ 14) నుంచి 24x7 అందుబాటులోకి రానున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఈ అర్ధ రాత్రి 12:30 గంటల నుంచి ఇది అమలులోకి రానున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకుల పని దినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.
ఆర్టీజీఎస్ అంటే?
ఆర్టీజీఎస్ అనేది తక్షణ నగదు బదిలీ వ్యవస్థ. కనీసం రూ.2 లక్షల నుంచి పెద్ద మొత్తాల్లో నగదు బదిలీకి ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు. గరిష్ఠ మొత్తం అనేది బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. మిగతా వ్యవస్థలతో పోలిస్తే.. తక్షణమే నగదు బదిలీ అవ్వడం ఈ వ్యవస్థ ప్రత్యేకత.
ఇదీ చూడండి:ద్రవ్యోల్బణం లెక్కలు, ఫెడ్ ప్రకటనలే కీలకం!