ETV Bharat / business

'అవును.. రూ.2 వేల నోట్ల ముద్రణ ఆపేశాం'

author img

By

Published : Aug 25, 2020, 4:41 PM IST

Updated : Aug 25, 2020, 7:06 PM IST

గత ఆర్థిక సంవత్సరం నుంచే రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపేసినట్లు అధికారికంగా ప్రకటించింది ఆర్​బీఐ. దీనితో 2018 మార్చి నాటికి 33,632 లక్షలుగా ఉన్న రూ.2 వేల నోట్ల సంఖ్య.. 2020 మార్చి ముగిసే సమయానికి 27,398 లక్షలకు తగ్గినట్లు వెెల్లడించింది.

Rs 2,000 notes were not printed in 2019-20
రెండు వేల నోట్ల ముద్రణ నిలిపేసిన ఆర్​

రూ.2వేల నోట్ల ముద్రణపై కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్​బీఐ) తెరదించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచే రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేసినట్లు స్పష్టం చేసింది.

తగ్గిన నోట్ల సంఖ్య

2018 మార్చి చివరి నాటికి చలామణిలో ఉన్న రూ.2వేల నోట్ల సంఖ్య 33,632 లక్షలుగా ఉన్నట్లు తెలిపింది ఆర్​బీఐ. ఈ సంఖ్య 2019 మార్చి ఆఖరు నాటికి.. 32,910లక్షలకు.. 2020 మార్చి చివరి నాటికి 27,398లక్షలకు తగ్గినట్లు ఆర్​బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.

చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ.2వేల నోట్ల సంఖ్య 2018 మార్చి నాటికి 3.3 శాతం ఉన్నట్లు తెలిపింది ఆర్​బీఐ. ఈ విలువ 2019 మార్చి నాటికి 3 శాతానికి, 2020 మార్చి చివరి నాటికి 2.4 శాతానికి తగ్గినట్లు పేర్కొంది.

మొత్తం కరెన్సీ విలువలో రూ.2వేల నోట్ల వాటా 2018 మార్చి చివరి నాటికి 37.3 శాతంగా ఉంది. ఇది 2019 మార్చి చివరి నాటికి 31.2 శాతానికి, 2020 మార్చి నాటికి 22.6 శాతానికి తగ్గింది అని ఆర్​బీఐ వివరించింది.

ఇదే సమయంలో 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి రూ.500, రూ.200 నోట్ల విలువ, సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆర్​బీఐ వెల్లడించిది.

నకిలీ నోట్ల లెక్కలివి..

నోట్ల ముద్రణ 2018-19 కంటే 2019-20లో 13.1శాతం తగ్గించినట్లు ఆర్​బీఐ తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ రంగంలో 2,96,695 నకిలీ నోట్లను గుర్తించినట్లు పేర్కొంది.

మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌లో వచ్చిన రూ.10 నోట్లలో నకిలీవి 144.6 శాతం, రూ.50 నకిలీ నోట్లు 28.7 శాతం, రూ.200 నకిలీ నోట్లు 151.2 శాతం, రూ.500 నకిలీ నోట్లు 37.5 శాతం పెరిగినట్లు ఆర్​బీఐ వెల్లడించింది.

ఇదీ చూడండి:నీరవ్ మోదీ భార్యపై 'రెడ్​ కార్నర్' నోటీసు

Last Updated : Aug 25, 2020, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.