ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. ఆహార ధరల్లో తగ్గుదల కారణంగా గత నెలలో ద్రవ్యోల్బణం 6.58 శాతంగా నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాల్లో తేలింది.
చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) ఈ ఏడాది జనవరిలో 7.59 శాతంగా, గత ఏడాది ఫిబ్రవరిలో 2.57 శాతంగా నమోదయ్యింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణం కూడా స్వల్పంగా తగ్గి 10.81 శాతంగా నమోదైంది. అంతకు ముందు(జనవరిలో) ఇది 13.63 శాతంగా ఉంది.
ఇదీ చూడండి:మరింత తగ్గిన బంగారం ధర- పసిడి బాటలోనే వెండి