రిటైల్ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) భారీగా దిగొచ్చింది. డిసెంబర్లో 4.59 శాతంగా నమోదైంది. ఆహార ధరల్లో తగ్గుదల ఇందుకు ప్రధాన కారణం.
నవంబర్లో సీపీఐ 6.93 శాతంగా ఉంది. ప్రభుత్వ అధికారిక గణాంకాల ద్వారా ఈ విషయం తెలిసింది.
ఆహార ద్రవ్యోల్బణం గత నెల 3.41 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెల (నవంబర్లో) ఇది 9.5 శాతంగా ఉంది.
పారిశ్రామికోత్పత్తి మళ్లీ డీలా..
2020 నవంబర్లో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) 1.9 శాతం క్షీణించినట్లు ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది.
తయారీ రంగ పీఎంఐ 2020 నవంబర్లో 1.7 శాతం, గనుల విభాగం 7.3 శాతం తగ్గింది. విద్యుదుత్పాదన మాత్రం 3.5 శాతం వృద్ధిని నమోదుచేసింది.
ఇదీ చూడండి:స్వల్పంగా పెరిగిన బంగారం ధర