రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రుణాల పునర్‌వ్యవస్థీకరణకు అనుమతినివ్వడంతో రూ.8.4 లక్షల కోట్ల విలువైన రుణాలను బ్యాంకులు దీనికోసం పరిశీలించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థలోని మొత్తం రుణాల్లో ఈ విలువ 7.7 శాతమని పేర్కొంది.
ఒకవేళ పునర్‌వ్యవస్థీకరణకు ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోకుంటే పైన చెప్పిన 8.4 లక్షల కోట్ల రుణాల్లో 60 శాతం రుణాలు నిరర్థక ఆస్తులుగా మారే ముప్పు పొంచి ఉండేదని తెలిపింది ఇండియా రేటింగ్స్. అంతేకాకుండా ఈ నిర్ణయం వల్ల బ్యాంకులు పెద్దగా కేటాయింపులు చేయాల్సిన అవసరమూ తప్పిందని, తద్వారా వాటి లాభదాయకతపై పడే భారం తగ్గుతుందని వివరించింది. నాన్ కార్పొరేట్ విభాగంలో సుమారు రూ.2.1 లక్షల కోట్లు, కార్పొరేట్ విభాగంలో రూ.3.3 లక్షల కోట్ల నుంచి రూ.6.3 లక్షల కోట్ల వరకు రుణాల పునర్‌వ్యవస్థీకరణ చోటుచేసుకోవచ్చని తెలిపింది.
ఇదీ చూడండి: వన్‌టైం రుణ పునర్నిర్మాణం అమలు సాధ్యమేనా?