ETV Bharat / business

మహమ్మారిలా మాంద్యం.. అంతటా మందగమన భయం - ఆర్థిక మాంద్యం

ఆర్థిక మాంద్యం భయం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. అంచనాలు తడబడుతున్నాయి. ఇవి తాత్కాలిక ఒడుదొడుకులేనా? అంతా బాగుందని అనుకున్న సమయంలో ఈ మందగమనాలు, మాంద్యాలు ఏమిటి? ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడుదొడుకులకు లోనుకాకుండా ప్రభుత్వాలు ఏమీ చేయలేవా, ఆర్థిక వ్యవస్థలు సాఫీగా కొనసాగలేవా, వృద్ధి, క్షీణత అనేవి ప్రకృతి నియమాల్లాగా ఆర్థిక వ్యవస్థలను పట్టిపీడిస్తాయా? ఇప్పుడీ ప్రశ్నలు అందరినీ తొలిచేస్తున్నాయి.

మహమ్మారిలా మాంద్యం..
author img

By

Published : Sep 5, 2019, 2:09 PM IST

Updated : Sep 29, 2019, 12:59 PM IST

ఆర్థిక మందగమనం... ఆర్థిక మాంద్యం... మహామాంద్యం... ఆర్థిక ఉద్దీపన... వాణిజ్య యుద్ధం... డీగ్లోబలైజేషన్‌- ఇప్పుడు ఎక్కడ చూసినా వీటిమీదే చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ఆందోళన నెలకొంది. వాహనాల అమ్మకాలు, రైళ్లలో సరకు రవాణా, దేశీయ విమాన ప్రయాణాలు, మౌలిక సదుపాయాలు, దిగుమతులు, పారిశ్రామిక ఉత్పత్తి, రుణాల లభ్యత, ఉద్యోగాల కల్పన... ఇలా ఎన్నో రంగాల్లో మనదేశంలో క్షీణత కనిపిస్తోంది. ఈ పరిస్థితికి భీకర వాణిజ్య యుద్ధాలూ తోడయ్యాయి. గత 30 ఏళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో వాణిజ్య యుద్ధాలకు అమెరికా అధ్యక్షుడు శ్రీకారం చుట్టారు. చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు ఎడాపెడా వేస్తున్నారు. ఐరోపా దేశాల్లోనూ పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడంలో భారత్‌, చైనాల పాత్ర గురించి ఆర్థికవేత్తలు నిన్నమొన్నటివరకు ఎంతో ఆశాభావంతో ఉన్నారు. 17, 18 శతాబ్దాల్లో ప్రపంచ ఉత్పత్తిలో భారత్‌, చైనాలే కీలక పాత్ర పోషించేవి. 1600 సంవత్సరం నాటికి ప్రపంచ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో భారత్‌, చైనాల వాటా 51.4 శాతంగా ఉండేది. ఉదాహరణకు ప్రపంచంలోని అన్ని దేశాల స్థూల ఉత్పత్తి విలువ వంద కోట్ల రూపాయలనుకుంటే భారత్‌, చైనాలు ఆనాటికి ఎలాంటి ఉన్నత స్థితిలో ఉండేవో తేలికగా అర్థమవుతుంది. 1750 నుంచి పరిస్థితి తలకిందులు కావడం మొదలైంది. కాలచక్రం గిర్రున తిరిగింది. 1950 నుంచి మొదట జపాన్‌, తరవాత ఆగ్నేయాసియా దేశాలు, ఆపై చైనా-భారత్‌లు వృద్ధిపథంలో దూసుకుపోతున్న పరిస్థితిని చూసి ఆసియా ఖండం మళ్ళీ ప్రపంచంలో అగ్రస్థానం అందుకుంటుందని చరిత్రకారులు అంచనా వేశారు. ఈ అంచనాలను ప్రస్తుత పరిస్థితులు తలకిందులు చేస్తాయా లేక ఇవి తాత్కాలిక ఒడుదొడుకులేనా? అంతా బాగుందని అనుకున్న సమయంలో ఈ మందగమనాలు, మాంద్యాలు ఏమిటి? ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడుదొడుకులకు లోనుకాకుండా ప్రభుత్వాలు ఏమీ చేయలేవా, ఆర్థిక వ్యవస్థలు సాఫీగా కొనసాగలేవా, వృద్ధి, క్షీణత అనేవి ప్రకృతి నియమాల్లాగా ఆర్థిక వ్యవస్థలను పట్టిపీడిస్తాయా? ఇప్పుడీ ప్రశ్నలు అందరినీ తొలిచేస్తున్నాయి.

మందగమనం అంటే...

దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి-సేవల విలువలను మార్కెట్‌ ధర ప్రకారం లెక్కగట్టి, ఆ మొత్తం విలువను స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)గా చెప్పుకొంటాం. రెండు త్రైమాసికాలు వరసగా జీడీపీ క్షీణిస్తే ఆర్థిక మందగమనంగా చెప్పుకోవచ్చు. మన జీడీపీ ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 5.8 శాతం ఉంటే, ఏప్రిల్‌-జూన్‌లో అది అయిదు శాతానికి పడిపోయింది. జులై-సెప్టెంబరు జీడీపీ ఇంకా తగ్గితే ఆర్థిక మందగమనం మెల్లిగా అన్ని రంగాలనూ చుట్టుముడుతోందని భావించవచ్చు. సహజంగా ఆర్థిక మందగమనం ఏడాది పాటు కొనసాగుతుందని ఆర్థికవేత్తలు చెబుతారు. జీడీపీ వృద్ధి ఒక్క శాతం తగ్గినా, దాని ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై ఉంటుంది.
ఆర్థిక మాంద్యం వస్తే కొన్నేళ్లపాటు కొనసాగుతుంది. అమెరికాలో 2008-2009లో వచ్చిన ఆర్థిక మాంద్యం ప్రభావం ఇప్పటికీ ఎంతోకొంత ఉంది. కొనుగోలు శక్తి పడిపోవడం, పెద్దయెత్తున నిరుద్యోగం, గిరాకీని మించి వివిధ రంగాల్లో సరఫరా పెరిగిపోవడం, ధరలు పతనం కావడం, వేతనాల్లో కోతలతో పాటు భవిష్యత్తుపై నిరాశ ఏర్పడటాన్ని ఆర్థిక మాంద్యం ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఆర్థిక మాంద్యం సమయంలో అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాల్లో క్షీణత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మాంద్యం ఏ రంగంలో ముందు మొదలవుతుందో ఎవరూ కచ్చితంగా ఊహించలేరు. 2007-2008లో ముందు ఆర్థిక రంగంలో సంక్షోభం మొదలైంది. ఆర్థికస్థోమతతో సంబంధం లేకుండా ఇచ్చిన గృహరుణాలను తిరిగి రాబట్టలేక పోవడంతో ఆ సంక్షోభం మొదలైంది. బ్యాంకింగ్‌ రంగం కకావికలమైంది. విత్త సంస్థలన్నీ చిందరవందర అయ్యాయి. ఎన్నో దేశాలు ఒడుదొడుకులకు లోనయ్యాయి.

అపార నష్టాలు...

మహామాంద్యమప్పుడు ఆర్థిక మాంద్యం తాలూకు అన్ని లక్షణాలూ తీవ్రస్థాయిలో కనబడతాయి. 1929-1940 వరకు మహామాంద్యం ప్రపంచ ఆర్థిక రంగాన్ని ఊపేసింది. ఎక్కడికక్కడ ఉత్పత్తులు పేరుకుపోయాయి. కొనుగోలు శక్తి లేకపోవడంతో ఇబ్బడిముబ్బడిగా సరకులున్నా కోట్లమంది దారిద్య్రంలో కూరుకుపోయారు. అమెరికా స్టాక్‌మార్కెట్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. ఒక్కరోజులో బిలియన్ల డాలర్లను షేర్‌హోల్డర్లు కోల్పోయారు. నిరుద్యోగం 25 శాతం దాటిపోయింది. పదేళ్లపాటు ఆర్థిక మాంద్యం, తరవాతి ఆరేళ్లు రెండో ప్రపంచ యుద్ధంతో అన్ని దేశాలూ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రగతి భావనపైనే చాలామందికి సందేహాలు తలెత్తాయి. విచిత్రం ఏమిటంటే- యుద్ధ విధ్వంసమే ఆర్థికాభివృద్ధికి గిరాకీ పెంపుదలకు ప్రేరణైంది. 1973 వరకు ఆర్థికాభివృద్ధి బ్రహ్మాండంగా కొనసాగింది. ఆర్థికరంగంలో అదొక స్వర్ణయుగం. దానికి చమురు దేశాలు పెద్ద షాక్‌ ఇచ్చాయి. 1973లో చమురు ఉత్పత్తిని తగ్గించి, ధరలు పెంచడంతో అమెరికాతో పాటు అభివృద్ధి చెందిన దేశాలు అతలాకుతలం అయ్యాయి. ఇక 1997లో ఆగ్నేయాసియా దేశాల్లో తలెత్తిన సంక్షోభం కూడా ప్రపంచాన్ని కుదిపేసింది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి విపరీతంగా వచ్చిపడిన పెట్టుబడులు, రుణాలు ఆగ్నేసియా దేశాలను అప్పుల్లోకి నెట్టేశాయి. థాయ్‌లాండ్‌లో మొదట చెల్లింపుల సంక్షోభం తలెత్తింది. దీంతో విత్త విపణుల్లో భయాందోళనలు మొదలై ఒక్కసారిగా విదేశీ పెట్టుబడులు పెద్దయెత్తున తరలిపోయాయి. ప్రభుత్వ ఖజానాలు వట్టిపోయాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చొరవతో పరిస్థితి కుదుటపడినా, విత్త మార్కెట్లు కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టింది.

ఆర్థిక మాంద్యాలు, క్షీణతలను మార్కెట్‌ ఆధారిత విత్త వ్యవస్థల్లో తప్పనిసరి సంఘటనలుగానే నిపుణులు భావిస్తారు. ఈ వ్యవస్థల్లో పెట్టుబడులు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల చేతుల్లో ఉంటాయి. లాభం ఉన్నచోటుకే పెట్టుబడి పరుగెడుతుంది. ప్రజల కొనుగోలు శక్తి ఎంత, ఏ వస్తువులు కొనేందుకు ఎంత కేటాయించుకుంటారు, వారి అభిరుచులు ఎప్పుడు మారతాయన్నవి తెలుసుకోవడం తేలికైన పనికాదు. స్థూలమైన అంచనాలతో ఉత్పత్తి మొదలుపెడతారు. చాలా సందర్భాల్లో అధికోత్పత్తి జరుగుతుంది. ఒక కంపెనీ సాంకేతికతను మెరుగుపరచుకుని ధరలు తగ్గిస్తే... పోటీ సంస్థల అమ్మకాలు పడిపోతాయి. స్టాక్‌మార్కెట్లు, బ్యాంకుల నుంచి ఎవరు, ఎప్పుడు డబ్బు ఉపసంహరించుకుంటారో చెప్పలేం. ఇవన్నీ నియంత్రణ లేని చర్యల్లా కొనసాగుతాయి. అస్థిరతకు పునాదులు స్వేచ్ఛామార్కెట్‌ విధానంలోనే ఉంటాయి. ఈ అస్థిరతలు ఒక్కొక్కప్పుడు వ్యవస్థ ఉనికికే ప్రమాదంగా మారతాయని 1929 నాటి మహామాంద్యం తెలియజెప్పింది. అప్పుడే జాన్‌ మేనార్డ్‌ కేన్స్‌ అనే ఆర్థికవేత్త ఆపద్బాంధవుడిలా రంగంపైకి వచ్చారు. ఆర్థిక వ్యవస్థను మార్కెట్‌ నియంత్రణకే వదిలి వేయకూడదని, ప్రభుత్వాలు వివిధ పథకాల కోసం పెద్దయెత్తున ఖర్చుపెడితేనే మాంద్యాలు రాకుండా చూసుకోవచ్చని సూచించారు. కేన్స్‌ సిద్ధాంతాలే ప్రభుత్వాల ఉద్దీపన చర్యలకు దారితీశాయి. సంక్షోభాలు వచ్చినప్పుడు వ్యవస్థలు కుప్పకూలకుండా కేన్స్‌ సిద్ధాంతాలు రక్షించాయి కానీ, అసలు సంక్షోభాలే రాకుండా అవి చేయలేకపోయాయి. ఒకప్పుడు అమెరికా గ్లోబరీకరణకు కేంద్రం. ట్రంప్‌ పుణ్యమా అని ఇప్పుడు డీగ్లోబలైజేషన్‌కు అది కేంద్రంగా మారుతోంది. ప్రపంచ వాణిజ్యసంస్థ నుంచి వైదొలగుతామని హెచ్చరించడం, ప్రపంచీకరణవల్ల చైనా, భారత్‌లే లాభం పొందుతున్నాయని విమర్శలు చేయడం, ప్యారిస్‌ వాతావరణ ఒప్పందానికి మంగళం పాడటం డీగ్లోబలైజేషన్‌గా భావిస్తున్నారు. బ్రెగ్జిట్‌ కూడా ఆ కోవకు చెందిందే. దీని ప్రభావం దేశాల మధ్య వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

కొంపముంచే ఏడు సమస్యలు

ప్రపంచ ఆర్థిక మందగమన భయానికి ఏడు సమస్యలను సూచికలుగా ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
1. అమెరికా-చైనా వాణిజ్యయుద్ధం: ఇది 18 నెలల క్రితం మొదలైంది. ఉక్కు ఉత్పత్తులపై 25 శాతం సుంకంతో మొదలై ఎన్నో ఉత్పత్తులకు విస్తరించింది. వచ్చే ఏడాదిలో చాలా రంగాలు దీనివల్ల ఒడుదొడుకులకు లోనవుతాయి.
2. అమెరికాలో క్షీణత: ట్రంప్‌ అధికారం చేపట్టేనాటికి కాస్త మంచి దశలో ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థలో మళ్ళీ కొంత క్షీణత మొదలైంది. పారిశ్రామికోత్పత్తి సూచికల్లో పదేళ్ల తరవాత క్షీణత కనిపించింది.
3. జర్మనీలోనూ అదే సమస్య: జర్మనీలో రెండో త్రైమాసికంలో కొంత క్షీణత కనిపించింది. మూడో త్రైమాసికంలో ఇది ఇంకా పెరగొచ్చు.
4. చైనా రుణ సంక్షోభం: అక్కడి ప్రభుత్వ సంస్థలు విపరీత రుణభారంతో సతమతమవుతున్నాయి. వినియోగదారులూ భారీగా రుణాలు తీసుకున్నారు. ఈ రుణ భారాలతో బ్యాంకులు కుంగిపోతున్నాయి. పారిశ్రామిక రంగంలో 30 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఎదుగుదల మందగించింది.
5. బ్రిటన్‌ కుయ్యోమొర్రో: ‘యూరోపియన్‌ యూనియన్‌’ నుంచి ఏ ఒప్పందం లేకుండా బయటకువస్తే బ్రిటన్‌కు తీవ్ర ఇక్కట్లు ఖాయం. దాని ప్రభావం అంతర్జాతీయంగానూ ఉంటుంది.
6. అయిదు దేశాల్లో అంతంతే: అర్జెంటీనా, ఇరాన్‌, దక్షిణాఫ్రికా, టర్కీ, వెనెజువెలా దేశాలు క్షీణతతో సతమతమవుతున్నాయి. ముఖ్యంగా టర్కీ, దక్షిణాఫ్రికాల గురించి అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఆందోళనగా ఉన్నారు. ఈ రెండు దేశాల్లో రుణాల చెల్లింపు సమస్యలు మొదలైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
7. అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్‌: ప్రస్తుతానికి అమెరికా, జర్మనీల్లో స్టాక్‌ మార్కెట్లు కొంత బాగానే ఉన్నా, బాండ్‌ మార్కెట్ల గురించి భయంగా ఉంది. అమెరికా ప్రభుత్వం నుంచి బాండ్లు కొన్నవారు ఇటీవల వాటిని అమ్మడం మొదలుపెట్టారు. 2008 ఆర్థిక సంక్షోభానికి ముందూ ఇలాగే జరిగింది. రాబోయే మందగమనానికి దీన్ని సూచికగా భావిస్తున్నారు.
- ఎన్‌.రాహుల్‌ కుమార్‌

Intro:Body:Conclusion:
Last Updated : Sep 29, 2019, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.