ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)లో ముగ్గురు నూతన స్వతంత్ర సభ్యులను కేంద్రం నియమించింది. ఈ నేపథ్యంలో రిజర్వు తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్ష తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 7 నుంచి మూడు రోజుల పాటు కీలక వడ్డీ రేట్లు సహా ఇతర అంశాలపై సమీక్ష జరగనున్నట్లు వెల్లడించింది.
నిజానికి సెప్టెంబర్ 29నే సమీక్ష జరగాల్సి ఉంది. స్వతంత్ర సభ్యుల నియామకంలో జాప్యం వల్ల సమీక్ష వాయిదా వేస్తున్నట్లు సెప్టెంబర్ 28న వెల్లడించింది ఆర్బీఐ.
కొత్త సభ్యులు
ప్రభుత్వం నియమించిన ఎంపీసీ సభ్యుల్లో.. అసిమా గోయల్, జయంత్ ఆర్ వర్మ, శశాంక బిడే ఉన్నారు.
ఇదీ చూడండి:సెప్టెంబర్లో సేవా రంగం దాదాపు రికవరీ!