ETV Bharat / business

ఆర్​బీఐ 'వార్​రూమ్'​తో ఆర్థిక కష్టాలకు చెక్​! - latest bussiness news updates

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఓ వార్​రూమ్​ను ఏర్పాటుచేసింది రిజర్వు బ్యాంక్‌ ఆఫ్​ ఇండియా. ప్రపంచంలోనే ఓ కేంద్ర బ్యాంకు ఇలా వార్​రూమ్​ను నెలకొల్పడం ఇదే తొలిసారి.

RBI set up war-room in just one day amid coronavirus outbreak for contry  economic systemRBI set up war-room in just one day amid coronavirus outbreak for contry  economic system
ఆర్థిక వ్యవస్థ కాపాడేందుకు ఆర్​బీఐ 'వార్​రూమ్'​
author img

By

Published : Mar 23, 2020, 8:27 AM IST

కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కార్యకలాపాలు నిలిచిపోకుండా రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వార్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. బిజినెస్‌ కంటిజెన్సీ ప్లాన్‌ (బీసీపీ)లో భాగంగా ఇలా వార్‌ రూమ్‌ను ఓ కేంద్రబ్యాంక్‌ నెలకొల్పడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు అత్యంత ముఖ్యమైన 90 మంది ఉద్యోగులతో ఈ వార్‌రూమ్‌ కార్యకలాపాలు సాగించనుంది. ఇందులో ఏ సమయంలో చూసినా, 45 మంది విధులు నిర్వహిస్తుంటే, మిగిలిన వారు రిజర్వ్‌లో ఉంటారు.

ఈ కేంద్ర కార్యకలాపాలు ఈ నెల 19న ప్రారంభమయ్యాయి. ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న 24 గంటల్లోనే వార్‌ రూమ్‌ నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని ఒక అధికారి తెలిపారు. ఆర్‌బీఐకి ఉన్న 600 మంది ఉద్యోగుల నుంచి 60 మంది కీలకమైన వారిని వార్‌రూమ్‌ కోసం తీసుకున్నారు. ఈ కేంద్రం నిర్వహణకు 70 మంది ఉద్యోగులుంటారు.

"ప్రపంచంలో ఈ తరహా బీసీపీ అమలు చేయడం ఇదే మొదటిసారి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇటువంటి సదుపాయాలు లేవు"

-ఆర్​బీఐ అధికారి.

రుణ నిర్వహణ, మిగులు నిధుల నిర్వహణ, నగదు కార్యకలాపాలు వంటి వాటిని వార్‌ రూమ్‌ నిర్వహిస్తోంది. బీసీపీకింద.. ఆర్‌బీఐ ఇతర డేటా కేంద్రాలు ఎస్‌ఎఫ్‌ఎమ్‌ఎస్‌, ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ వంటి వ్యవస్థలను నడిపిస్తాయి.

ఇదీ చూడండి : కరోనా ప్రభావంతో నెమ్మదించిన నియామకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.