ETV Bharat / business

వృద్ధి రేటు రికవరీ పరుగులు కొనసాగేనా? - క్యూ2 జీడీపీ గణాంకాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పుంజుకుని -7.5 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. కరోనా కారణంగా క్యూ1లో -23.9 శాతానికి పతనమైన వృద్ధి రేటు ఈ స్థాయిలో రికవరీ సాధించడానికి కారణాలేమిటి? రికవరీ పరుగులు రానున్న త్రైమాసికాల్లోనూ కొనసాగుతాయా?

Reasons for growth rate recovery
ఆర్థిక వ్యవస్థ రికవరీకి కారణాలు
author img

By

Published : Nov 29, 2020, 1:25 PM IST

కరోనా సృష్టించిన సంక్షోభం తర్వాత.. భారత ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పుంజుకుంటున్నట్లు తాజా గణాంకాల్లో తేలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు -23.9 శాతంగా నమోదవ్వగా.. రెండో త్రైమాసికంలో -7.5 శాతానికి రికవరీ అయినట్లు తాజా అధికారిక గణాంకాల్లో వెల్లడైంది. ఈ లెక్కలు భారత ఆర్థిక వ్యవస్థ 'V' ఆకారపు రికవరీ సాధిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.

వృద్ధి రేటు వేగంగా పుంజుకుంటున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్​ (16.4 శాతం)తో పాటు బ్రిటన్​ (15.5 శాతం), ఫ్రాన్స్ (14.6 శాతం), అమెరికా (7.4 శాతం) ఉన్నాయి.

భారత వృద్ధి రేటు ఆశించిన దానికంటే వేగంగా పుంజుకోవడం సానుకూలమైన అంశమని నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్ రాజీవ్ కుమార్ అంటున్నారు. ఇందుకు ప్రధాన కారణమైన తయారీ రంగ రికవరీ.. దేశవ్యాప్తంగా పెరిగిన డిమాండ్​ను కూడా సూచిస్తున్నట్లు తెలిపారు.

రికవరీకి ప్రధాన కారణాలు..

కరోనా సంక్షోభంలోనూ వ్యవసాయ రంగం సానుకూలంగా స్పందిస్తోంది. రెండో త్రైమాసిక గణాంకాల ప్రకారం వ్యవసాయ అనుంబంధ రంగాలు 3.4 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి. మొదటి త్రైమాసికంలోనూ ఆయా రంగాలు ఇదే వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హం.

2020-21 క్యూ1లో 39.3 శాతం క్షీణించిన తయారీ రంగ వృద్ధి రేటు.. రికార్డు స్థాయిలో క్యూ2లో 0.6 శాతానికి రికవరీ సాధించింది.

లాక్​డౌన్​ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో -50.3 శాతంగా నమోదైన రియల్టీ రంగ వృద్ధి రేటు.. రెండో త్రైమాసికంలో -8.6 శాతానికి చేరింది.

అత్యవసరం కాని సేవలైన.. హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్​ వంటి రంగాల్లో వృద్ధి రేటు క్యూ1తో పోలిస్తే క్యూ2లో -47 శాతం నుంచి -15.6 శాతానికి రికవరీ అయ్యింది. ఈ పరిణామాలన్ని క్యూ2లో రికార్డు స్థాయి రికవరీకి తోడయ్యాయి.

పరుగు కొనసాగేనా?

భారతీయ రిజర్వు బ్యాంక్ నెలవారీ నివేదికలో.. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సానుకూల వృద్ధి రేటు నమోదవ్వొచ్చని అంచనా వేసింది.

జీడీపీ గణాంకాలు విడుదలైన తర్వాత ముఖ్య ఆర్థిక సలహాదారు వీ సుబ్రమణ్యం.. భవిష్యత్ వృద్ధి రేటు రికవరీపై ఆశావాద దృక్పథంతో ఉన్నట్లు తెలిపారు.

పండుగ సీజన్​లో వాహన, ఎఫ్​ఎంసీజీ రంగాల్లో నమోదైన భారీ కొనుగోళ్లు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ​ (క్యూ3) సానుకూల వృద్ధి రేటుకు మద్ధతు ఇవ్వొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరి-మార్చి త్రైమాసిక వృద్ధి రేటును మాత్రం.. డిమాండ్​ సామర్థ్యం, కరోనా రెండో దశ విజృంభణ భయాలు, వ్యాక్సిన్ అభివృద్ధి పరిణామాలు నిర్ణయిస్తాయని చెబుతున్నారు

ఇదీ చూడండి:ఆర్థిక వృద్ధిలో పుంజుకున్న భారత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.