ETV Bharat / business

12 రోజుల్లో రూ.16 వేల కోట్ల ఎంఎస్​ఎంఈ రుణాలు - ఎంఎస్​ఎంఈలకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ

అత్యవసర రుణ గ్యారెంటీ పథకం కింద చిన్న పరిశ్రమలకు రూ.16,031 కోట్లు రుణాలు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జూన్​ 1 నుంచి 12 వరకు ఈ రుణాలు అందించినట్లు వెల్లడించారు. ఇదే సమయం నాటికి మొత్తం రూ.32 వేల కోట్లకుపైగా రుణాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

finance ministry on msme loans
చిన్న పరిశ్రమలకు రుణాల మంజూరు ముమ్మరం
author img

By

Published : Jun 16, 2020, 4:38 PM IST

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్​ఎఈలకు) జూన్​ 1 నుంచి 12 మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రూ.16,031.39 కోట్ల రుణాలు అందించామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఎంఎస్​ఎంఈలను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక లభ్యత పథకం కింద ఈ రుణాలు ఇచ్చినట్లు పేర్కొంది.

ఆత్మ నిర్భర్​ భారత్​లో భాగంగా..

కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో కుదేలైన దేశ ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు 'ఆత్మ నిర్భర్​ భారత్​' పేరుతో కేంద్రం రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అత్యవసర రుణ గ్యారెంటీ పథకం కింద రూ.3 లక్షలు కేటాయించారు.

ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు జూన్‌ 1 నుంచి జూన్‌ 12 వరకు రూ.32,049.86 కోట్ల రూపాయలను మంజూరు చేశాయి. ఇందులో రూ.16,031.39 కోట్లు ఇప్పటికే లబ్ధిదారులకు అందినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్​లో వెల్లడించారు.

  • As of 12 June 2020, #PSBs have sanctioned loans worth Rs 32,049.86 crore under the 100% Emergency Credit Line Guarantee Scheme, out of which Rs 16,031.39 crore has already been disbursed. Here are the bank-wise and state-wise details. #AatmanirbharBharat #MSMEs pic.twitter.com/JuxeU50BwI

    — NSitharamanOffice (@nsitharamanoffc) June 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:విమాన సంస్థలకు షాక్.. భారీగా పెరిగిన ఏటీఎఫ్ ధరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.