ETV Bharat / business

ఎంఎస్​ఎంఈలకు 9 రోజుల్లో రూ.12,201 కోట్ల రుణాలు

లాక్​డౌన్​తో సంక్షోభంలో చిక్కుకున్న ఎంఎస్​ఎంఈలకు జూన్​ 1 నుంచి జూన్ 9 మధ్య రూ.12,200.65 కోట్ల రుణాలు అందించాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. ఆత్మ నిర్భర్​ భారత్​లో భాగంగా కేటాయించిన రూ.3 లక్షల కోట్ల నుంచే ఈ రుణాలు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

Nirmala Sitharaman on msme loans
చిన్న పరిశ్రమలకు భారీ రణాలు
author img

By

Published : Jun 11, 2020, 2:19 PM IST

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్​ఎఈలకు) జూన్​ 1 నుంచి 9 మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంకులు రూ.12,200.65 కోట్ల రుణాలు అందించాయని చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎంఎస్​ఎంఈలను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక లభ్యత పథకం కింద ఈ రుణాలు ఇచ్చినట్లు ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

ఆత్మ నిర్భర్​ భారత్​లో భాగంగా..

కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో కుదేలైన దేశ ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు 'ఆత్మ నిర్భర్​ భారత్​' పేరుతో కేంద్రం రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అత్యవసర రుణ గ్యారెంటీ పథకం కింద రూ.3 లక్షలు కేటాయించారు.

ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు జూన్‌ 1 నుంచి జూన్‌ 9 వరకు రూ.24,260.65 కోట్ల రూపాయలను మంజూరు చేశాయి. ఇందులో రూ.12,200.65 కోట్లు ఇప్పటికే లబ్ధిదారులకు అందినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

అగ్రస్థానంలో తమిళనాడు...

ఎంఎస్​ఎంఈలకు రుణాల మంజూరులో రూ.2,637 కోట్లతో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా.. రూ.2,547 కోట్ల రుణాల మంజూరుతో ఉత్తర్​ప్రదేశ్​ రెండో స్థానంలో ఉంది.

బ్యాంకుల వారీగా లెక్కలు..

ఎస్​బీఐ అత్యధికంగా రూ.13,363 కోట్లు మంజూరు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.1,893 కోట్లు), యూనియన్​ బ్యాంక్ (రూ.1,842 కోట్లు), పంజాబ్​ నేషనల్​ బ్యాంక్ (రూ.1,772 కోట్లు) ఉన్నాయి.

ఇదీ చూడండి:ఐఐటీ విద్యార్థుల స్టార్టప్​లో ఆనంద్‌ మహీంద్రా పెట్టుబడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.