ETV Bharat / business

బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా? - రానున్న రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండనున్నాయి

కరోనా వ్యాక్సిన్​పై అంచనాలు, స్టాక్ మార్కెట్ల ప్రభావం.. వంటివి ఇటీవల బంగారం ధరను కాస్త తగ్గించాయి. ఇదే సమయంలో పండుగ సీజన్​ కూడా నడుస్తోంది. మరి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయమా? రానున్న రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండనున్నాయి? ఈ అంశంపై నిపుణుల విశ్లేషణలు ఇలా ఉన్నాయి.

Expert predictions on the rise in psidi prices
బంగారంపై పెట్టుబడులకు ఇది సరైన సమయమేనా
author img

By

Published : Nov 13, 2020, 12:48 PM IST

దేశీయంగా బంగారం ధరలు ఇటీవల కాస్త దిద్దుబాటుకు లోనవుతున్నాయి. ఇప్పుడే దీపావళి సందడి కూడా మొదలైన నేపథ్యంలో పసిడి కొనుగోళ్లు పెరగొచ్చనే అంచనాలు పెరిగిపోయాయి. అయితే నిపుణులు మాత్రం స్వల్ప, మధ్యస్థకాలానికి ధరలు మళ్లీ పెరుగుతాయనే అంచనా వేస్తున్నారు.

Women Buying Gold Ahead of Festival
పండుగ నేపథ్యంలో పసిడి కొనుగోలు చేస్తున్న మహిళలు

బంగారం ధర ఎందుకు తగ్గిందంటే..

తాము అభివృద్ధి చేసిన కొవిడ్ 19 టీకా 90 శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు ఔషధ సంస్థ ఫైజర్ ప్రకటన చేసిన తర్వాత.. ఈ వారం ఆరంభంలో పసిడి ధర 10 గ్రాములకు రూ.50 వేల దిగువకు చేరింది. అయితే మళ్లీ ఒక్క రోజులోనే రూ.50,600 వద్దకు పెరిగింది.

'ఇటీవల తగ్గిన బంగారం ధర ఇంతకు ముందు ర్యాలీని అందిపుచ్చుకోని వారికి మంచి అవకాశమిచ్చింది. రానున్న నెలల్లో పసిడి సానుకూలంగా సాగే వీలుంది.' అని ఏంజెల్ బ్రోకింగ్ క‌మోడిటీ, కరెన్సీస్ విభాగం అసిస్టెంట్ వైస్​ ప్రెసిడెంట్ (రీసెర్చ్) ప్రతామేష్ మాల్యా అంటున్నారు.

Youth gold Buying to Festival
పండుగ ముందు యువత గోల్డ్​ షాపింగ్

రెండంకెల లాభం..

పెరిగిన ధరలు ఈ ఏడాది పసిడి పెట్టుబడులకు రెండంకెల లాభాలను ఇచ్చాయని ప్రతామేష్ మాల్యా చెప్పారు. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి, చాలా దేశాల్లో తక్కువ వడ్డీ రేట్లు, సులభతరమైన లిక్విడిటీ వంటివి రానున్న నెలల్లో పసిడి ధరలు మరింత పెరిగేందుకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. వచ్చే దీపావళి నాటికి దేశంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.56 వేలకు చేరొచ్చని అంచనా వేశారు.

అయితే అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించడం వల్ల మార్కెట్లలో అనిశ్చితి చాలా వరకు తగ్గిందన్న విషయాన్ని గుర్తు చేశారు మాల్యా. రాబోయే రోజుల్లోనూ బంగారం, వెండి ధరలు కొంత అస్థిరతను ఎదుర్కోవచ్చనే అంచనాలను తోసిపుచ్చలేమని స్పష్టం చేశారు.

బలహీన డాలర్​ పసిడికి మంచిదే..

డాలర్ విలువ తగ్గుతుండటం కూడా.. అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరిగేందుకు దోహదం చేయొచ్చని ఐఐటీ అహ్మదాబాద్​లోని ఇండియన్ గోల్డ్ పాలసీ (ఐజీపీసీ) ఛైర్మన్ ప్రొఫెసర్ అరవింద్ సహాయ్​ విశ్లేషిస్తున్నారు.

కీలక వడ్డీ రేట్లను 2 నుంచి 3 ఏళ్ల వరకు సున్నా వద్దే ఉంచాలని అమెరికా ఫెడ్ నిర్ణయించడం వంటివీ.. బంగారం ధరల పెరుగుదలకు దోహదం చేయొచ్చని అభిప్రాయపడ్డారు.

అయినప్పటికీ రూపాయి బలంగా ఉన్నకారణంగా.. దేశీయంగా బంగారం ధరలు ఈ ఏడాది ఆగస్టులో జీవనకాల గరిష్ఠాలను తాకిన స్థాయిలకు ఇప్పుడప్బుడే చేరుకోకపోవచ్చని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి మధ్య వరకు బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు.. 4-5 శాతానికి పరిమితవ్వచ్చని అంచనా వేశారు.

ఇదీ చూడండి:పెరిగిన ధరలతో బంగారు రుణాలకు భలే డిమాండ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.