ETV Bharat / business

బడ్జెట్: సంస్కరణలతో అభివృద్ధి పయనం - మోదీ

అభివృద్ధి పథంలో శరవేగంగా పరుగులు పెట్టే నవభారత నిర్మాణమే లక్ష్యంగా కేంద్రం 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్​ తీసుకొచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు పెంచడమే ధ్యేయంగా కార్యాచరణ ప్రణాళిక ఆవిష్కరించింది. సామాన్యులకు భారీ వరాలు ప్రకటించకపోయినా... జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రధానాంశంగా కీలక కార్యక్రమాలు ప్రకటించింది.

బడ్జెట్: సంస్కరణలతో అభివృద్ధి పయనం
author img

By

Published : Jul 5, 2019, 5:06 PM IST

Updated : Jul 5, 2019, 7:43 PM IST

సంస్కరణలతో అభివృద్ధి పయనం

వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక స్థితిగతుల మార్పే లక్ష్యంగా వార్షిక బడ్జెట్​ ప్రవేశ పెట్టింది. పక్కా ప్రణాళికలతో ఆర్థిక సంస్కరణలకు ఆచరణ మార్గాల్ని ప్రస్తావిస్తూ తొలిసారి బడ్జెట్​ ప్రవేశపెట్టారు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్.

దేశ ఆర్థిక వ్యవస్థకు జీవన రేఖలుగా భావించే మౌలిక వసతులు, ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది మోదీ 2.0 సర్కారు. గ్రామాలు-పట్టణాల మధ్య అంతరాల్ని తగ్గించేలా రవాణా మార్గాలకు ప్రాధాన్యమిచ్చింది. నిర్ణీత కాలపరిమితితో అందరికీ ఇళ్లు, ఇంటింటికీ నీరిస్తామని స్పష్టం చేసింది. యువత, మహిళలు, రైతులు, పేదలు ఇలా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే పథకాల్ని ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి నవీన భారత నిర్మాణమే లక్ష్యమని ఉద్ఘాటించారు.

ఉపాధి కల్పనపై...

గత 45 ఏళ్లలో ఎన్నడూ చూడని నిరుద్యోగంతో యువత ఉక్కిరిబిక్కిరవుతోంది. సాంకేతికతతో మరిన్ని ఉద్యోగాలు ఊడిపోతాయన్న అంచనాల మధ్య ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కేంద్రం భారీ పరిశ్రమలు స్థాపించే బహుళజాతి సంస్థలను దేశంలోకి ఆహ్వానించేందుకు త్వరలోనే నూతన విధానాన్ని ప్రకటిస్తామని తెలిపింది.

పన్ను మినహాయింపు లేనట్లే...

మోదీ 2.0 ప్రభుత్వం తొలి బడ్జెట్​లో పన్ను మినహాయింపు కల్పిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూసిన సగటు భారతీయుడికి నిరాశే మిగిలింది. ఆదాయ పన్నులు యథాతథమని ప్రకటించారు నిర్మలా సీతారామన్​. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితుల్లో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. రూ. 5 లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను ఉండదన్నారు.

అయితే మధ్యతరగతి గృహ రుణగ్రహీతలకు మరికాస్త ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​లో ప్రతిపాదనలు చేసింది. 2020 మార్చి వరకు గృహ రుణాల వడ్డీపై రూ .1.50 లక్షల అదనపు పన్ను మినహాయింపును కల్పిస్తున్నట్లు తెలిపింది. ఫలితంగా వడ్డీ రాయితీ రూ.2 లక్షల నుంచి రూ.3.50 లక్షలకు పెరగనుంది.

రూ.45 లక్షలలోపు గృహ రుణాలపై ఈ రూ.3.50 లక్షలు వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్​ తెలిపారు. విద్యుత్​ వాహనాల కొనుగోలు కోసం తీసుకున్న రుణాలపైనా రూ. 1.50 లక్షల ఆదాయ పన్నును తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

సుంకాల మాటేంటి...?

దేశ రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపిన నిర్మలా సీతారామన్‌ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రక్షణరంగ వస్తువులపై పూర్తిస్థాయి ప్రాథమిక సుంకాన్ని తొలగిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దృష్టిలో పెట్టుకొని పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 2 రూపాయల మేర సుంకం పెంచుతున్నట్లు తెలిపారు. బంగారం సహా ఇతర విలువైన ఆభరణాలపై రెండున్నర శాతం సుంకం మోపారు.

కస్టమ్స్‌ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో సవరణలను నిర్మల ప్రతిపాదించారు.

బ్యాంకింగ్​ రంగ ప్రక్షాళన...

బ్యాంకింగ్‌ రంగం ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతానికి, వాటి రుణ సామర్థ్యాన్ని పెంచేందుకు 70 వేల కోట్ల రూపాయలను అందజేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగబ్యాంకుల్లో పేరుకుపోయిన నిరర్ధక ఆస్తులను లక్ష కోట్లు తగ్గించామని సీతారామన్ ప్రస్తావించారు.

దివాలా చట్టం కింద రూ.4 లక్షల కోట్ల మొండి బకాయిలను బ్యాంకులు వసూలు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే పీసీఏల ద్వారా 6 ప్రభుత్వ రంగ బ్యాంకులను సంక్షోభం నుంచి గట్టెక్కించినట్లు చెప్పారు.

విదేశీ పెట్టుబడులకు ఊతం...

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణకు భారత్‌ ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతామని బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మీడియా, విమానయానం, బీమా రంగాలలోకి మరిన్ని ఎఫ్​డీఐలను అనుమతించే ప్రక్రియను పరిశీలిస్తామని తెలిపింది. ఇన్సూరెన్స్ మధ్యవర్తిత్వ సంస్థల్లోకి 100% ఎఫ్​డీఐలను అనుమతించనున్నట్లు వెల్లడించారు ఆర్థిక మంత్రి. పెట్టుబడుల మార్కెట్‌ను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ప్రజా పెట్టుబడుల పరిమితిని 25 నుంచి 35 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు.

స్టాక్‌ మార్కెట్లలో ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులకు మరింత వెసులుబాటు కల్పిస్తామని సీతారామన్​ ప్రకటించారు. ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులకు విదేశీ పోర్టుఫోలియోగా గుర్తింపునిస్తామని తెలిపారు.

5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థికం...

నవీన భారతావని రూపకల్పనే లక్ష్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన ప్రణాళికలను బడ్జెట్‌లో ఆవిష్కరించారు. వచ్చే కొన్నేళ్లలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం పది సూత్రాల ప్రణాళికను ప్రకటించారు. విధాన నిర్ణయాల అమలును మరింత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.

ఒకే దేశం-ఒకే గ్రిడ్​...

రాష్ట్రాలకు విద్యుత్‌ సరసమైన ధరల్లో అందించేందుకు ఒకే దేశం-ఒకే గ్రిడ్‌ విధానాన్ని అవలంబించనున్నట్లు తెలిపారు సీతారామన్. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రాలకు తక్కువధరలో విద్యుత్ లభిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

గ్రామ్​ సడక్​ యోజన...

పర్యావరణ హిత పదార్థాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉపయోగించి ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన ద్వారా 30 వేల కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించినట్లు తెలిపారు నిర్మలా సీతారామన్‌. ఇదే పథకం మూడోదశ కింద 80 వేల 250 కోట్ల రూపాయల వ్యయంతో లక్షా 25 వేల కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి పరుస్తామన్నారు.

Indore (MP), July 05 (ANI): The residents of Indore's Kanadiya Village have come up with a unique idea to combat water crisis. They have revived a river and built a small dam with the help of an engineer. Water scarcity had been a problem from past 10 years but locals contributed money to fight with the crisis.While speaking to ANI, one of the locals said, "All villagers contributed money. The people came up with the idea first and then took the help of an engineer. Water crisis had been a problem from past 10 years. Water used to get exhausted every year by March-April, we either used to fetch water from jungle or spend money on water tankers. After the dam was built here, all water resources are recharged, no more water crisis."
Last Updated : Jul 5, 2019, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.