అప్పడాలపై జీఎస్టీ(GST on Papad)! నిజమా అప్పడాలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయా? ఇంతకీ వాటిపై జీఎస్టీ ఎంత(Papad GST rate)? చతురస్రాకారంలో ఉన్న అప్పడాలకు మాత్రమే జీఎస్టీ వర్తిస్తుందా? గుండ్రంగా ఉంటే జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదా? ఇవన్నీ సోషల్ మీడియాలో వెల్లువెత్తిన సందేహాలు. వీటన్నింటికీ ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్షా గొయెంకా చేసిన ఓ ట్వీట్ ప్రధాన కారణం.
-
Did you know that a round papad is exempt from GST and a square papad attracts GST ? Can anyone suggest a good chartered accountant who can make me understand the logic? pic.twitter.com/tlu159AdIJ
— Harsh Goenka (@hvgoenka) August 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Did you know that a round papad is exempt from GST and a square papad attracts GST ? Can anyone suggest a good chartered accountant who can make me understand the logic? pic.twitter.com/tlu159AdIJ
— Harsh Goenka (@hvgoenka) August 31, 2021Did you know that a round papad is exempt from GST and a square papad attracts GST ? Can anyone suggest a good chartered accountant who can make me understand the logic? pic.twitter.com/tlu159AdIJ
— Harsh Goenka (@hvgoenka) August 31, 2021
"చతురస్రాకారంలో ఉన్న అప్పడంపై జీఎస్టీ వేస్తున్నారు. రౌండ్‌గా ఉన్న అప్పడాలకు జీఎస్టీ మినహాయింపు. ఇందులో ఉన్న లాజిక్ నాకు అర్థం కావడం లేదు. ఎవరైనా మంచి ఛార్టర్డ్ అకౌంటెంట్ అదేమిటో కాస్త వివరించండి."
-హర్షా గొయెంకా, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్
ఆయన ఇటీవలే ఈ ట్వీట్ చేయగా.. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనిపై ఎవరికి తోచిన రీతిలో వారు స్పందించారు. కొందరు నవ్వుకునే కారణాలు చెప్పగా.. మరికొందరు వింత లాజిక్‌లు చెప్పారు. ఈ చర్చను గమనించిన.. కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (సీబీఐసీ) హర్షా గొయెంకా ట్వీట్‌కు సమాధానమిచ్చింది.
ఆకారంతో సంబంధం లేకుండా అప్పడం ఏదైనా జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని స్పష్టం చేసింది సీబీఐసీ. జీఎస్టీ నోటిఫికేషన్ No.2/2017-CT(R)లోని No.96లో ఈ విషయం పేర్కొన్నట్లు తెలిపింది. సంబధిత నోటిఫికేషన్ cbic.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు వివరించింది.
ఇదీ చదవండి: క్యూ1లో జీడీపీ 20 శాతం జంప్- కొవిడ్ నుంచి తేరుకున్నట్టేనా?