ETV Bharat / business

'సంస్కరణలతో సంక్షోభం నుంచి అభివృద్ధి దిశగా అడుగులు'

కరోనా సంక్షోభ దశను దేశం సులువుగా అధిగమించేలా కృషి చేయటమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్​ ఉద్ఘాటించారు. తాము తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా.. ఈ సవాలును అభివృద్ధి, భారత శ్రేయస్సు కోసం అవకాశంగా మలుచుకుంటామని స్పష్టం చేశారు.

anurag thakur interview
అనురాగ్ ఠాకూర్
author img

By

Published : Jun 3, 2020, 7:33 PM IST

కరోనా సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్​ స్పష్టం చేశారు. 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకునే ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించామని ఉద్ఘాటించారు. మరిన్ని విశేషాలు ఇలా...

ప్రశ్న: ప్రస్తుతం వలస కార్మికుల సంక్షోభాన్ని చూస్తే, ఎక్కడివారు అక్కడే ఉండేలా వారిలో విశ్వాసం కలిగించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందా? వలస కూలీలకు ప్రత్యక్ష నగదు బదిలీ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏమిటి?

జ: ఇది రాష్ట్రాల ప్రాథమిక బాధ్యత. ఇలాంటి సంక్షోభ సమయంలో సొంత, వలస కూలీలను రాష్ట్రాలు సమన్వయం చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో రైలు రవాణా సౌకర్యం కల్పించటమే కేంద్ర ప్రభుత్వం బాధ్యత. 3,840 రైళ్లలో 52 లక్షల మందిని ఇళ్లకు చేర్చాం. ఆహార సదుపాయం కల్పించాం.

సంక్షోభంతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు గరీభ్ కల్యాణ్​ పథకాన్ని తీసుకొచ్చాం. ఉపాధి హామీ పథకానికి ఎన్నడూ లేని విధంగా రూ.లక్ష కోట్లు కేటాయించాం. దీని వల్ల స్వరాష్ట్రాలకు చేరిన కార్మికులకు ఉపాధి లభిస్తుంది.

ప్రశ్న: ఆర్థిక పరిమితుల కారణంగా ప్రత్యక్ష పన్ను ప్రయోజనాలను ఆదాయ, మధ్య తరగతి ప్రజలకు ఇవ్వకుండా ప్రభుత్వం వదిలేస్తుందా?

జ: భారత ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్​ఎంఈ రంగం వెన్నెముక. ఇది 12 కోట్ల మందికి ఉపాధినిస్తోంది. ఎగుమతుల్లో 45శాతం ఈ రంగం నుంచే వెళుతున్నాయి. ప్రస్తుతం ఈ రంగానికి రూ.3లక్షల కోట్లు కేటాయించి 100శాతం పూచీకత్తు లేని రుణాలను అందిస్తున్నాం.

దివాలా చట్టం నుంచి 7,9, 10 సెక్షన్లను ఏడాది పాటు రద్దు చేశాం. ఇది ఎంఎస్​ఎంఈలకూ వర్తిస్తుంది. మధ్య తరగతి ప్రజలకు అధిక నిధులు అందేలా టీడీఎస్​ రేట్లను 25శాతం తగ్గించాం. ఫలితంగా రూ.50 వేల కోట్ల నగదును మార్కెట్లోకి చొప్పించాం. ఈ తగ్గింపు 2021 మార్చి 21 వరకు కొనసాగుతుంది. అందవల్ల ఈ రంగాలకు వేతనాల చెల్లింపుల్లో ఇబ్బందులు తగ్గిస్తుంది. కొనుగోలు శక్తి పెరిగి తొందరగా కోలుకునే అవకాశం ఉంది.

ప్రశ్న: బడ్జెట్​కు అదనంగా ఖర్చు చేయనిదే ఆర్థిక ఉద్దీపనకు అర్థం లేదని కేంద్ర మాజీ విత్త మంత్రి చిదంబరం అన్నారు. ఈ విమర్శలపై మీరెమంటారు?

జ: మాకు ఆర్థిక వ్యవస్థపై పూర్తి అవగాహన ఉంది. దేశంలోని అన్ని వర్గాలు ఉద్దీపన ప్యాకేజీ పరిధిలోకి వచ్చేలా రూపొందించాం.

ప్రశ్న: ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న డిమాండ్​ను 20 లక్షల కోట్ల ప్యాకేజీ తీర్చలేదని నిపుణులు అంటున్నారు. దీనిపై ఎలా స్పందిస్తారు?

జ: ఈ సంక్షోభంలో డిమాండ్, సప్లై సూత్రం పనిచేయదు. సప్లై పెరిగితే డిమాండ్​ కూడా ప్రభావితమవుతుంది. ఆర్థిక, ఇతర ఆదాయ మద్దతు ఇవ్వటం వల్ల వినియోగ వస్తువుల డిమాండ్ మెరుగుపడుతోంది. గరీబ్ కల్యాణ్​ కింద 41 కోట్ల మందికి రూ.52 వేల కోట్లు చేరవేశాం.

రైతులకు రూ.18 వేల కోట్లు, మహిళల జన్​ధన్ ఖాతాల్లో రూ. 20వేల కోట్లు జమ చేశాం. దివ్యాంగులు, వృద్ధులు, భవన నిర్మాణ కార్మికులు ఇలా చాలా వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీ చేశాం. ఉచిత వంటగ్యాస్​ అందించాం. ఈపీఎఫ్​ చందాను ఆర్నెల్ల పాటు కేంద్రమే భరిస్తోంది.

ఆదాయేతర వర్గాలకు టీడీఎస్, టీసీఎస్​ రేటు 25శాతం తగ్గింపుతో రూ.50వేల కోట్ల అదనపు ద్రవ్య లభ్యత పెరిగింది. 12 లక్షలకు పైగా జీతం ఉన్నవారికి ఆదాయపు పన్ను వాపసు ద్వారా రూ.27 వేల కోట్లు సమకూరాయి.

ప్రశ్న: బ్యాంకుల రుణ లభ్యతను పెంచారు. దీని వల్ల బ్యాంకుల సామర్థ్యాన్ని అంచనా వేశారా? రుణాలు, నిరర్ధక ఆస్తులు పెరిగితే ఎలా?

జ: బ్యాంకుల సామర్థ్యంపై ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది. సంప్రదింపుల తర్వాతే నిర్ణయాన్ని ప్రకటించాం. ఎంఎస్​ఎంఈ రంగంలో టర్నోవర్​ రూ.100 కోట్లకన్నా తక్కువగా ఉన్న కంపెనీలకు గరిష్ఠంగా రూ.25 కోట్ల రుణాన్ని ఇవ్వనున్నాం.

ప్రశ్న: కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన రవాణా, పర్యటకం, ఎగుమతుల రంగాలకు భవిష్యత్తులో ఏవైనా ఉద్దీపనలు ప్రకటించనున్నారా?

జ: ఈ రంగాలన్నీ ఎంఎస్​ఎంఈ కిందికే వస్తాయి. ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షల కోట్లతో ఈ రంగాలు కూడా లబ్ధి పొందుతాయి. మేం ప్రవేశపెట్టిన సంస్కరణలకు కొంత ఆటంకం కలిగినా.. ఇది నిరంతర ప్రక్రియ. అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నాం.

ప్రశ్న: కరోనా విజృంభణ తర్వాత నిరుద్యోగం వేగంగా పెరుగుతోంది. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఏవైనా ప్రత్యేక పథకాన్ని ఆలోచిస్తోందా?

జ: ఎంఎస్​ఎంఈ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రకటించిన చర్యల ద్వారా జీతభత్యాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ రంగం బలపడితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ జాతీయ ఉపాధి పథకం ద్వారా జీవనోపాధి లభిస్తుంది. మున్ముందు కొత్త మార్గాల్లో సరికొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాం. భారతీయులు, భారతీయ కంపెనీల కోసం మోదీ ప్రభుత్వం సాధ్యమైనంత మేర కృషి చేస్తుంది.

ప్రశ్న: ప్రస్తుతం దేశం ఎన్నడూ చూడని విపత్తును ఎదుర్కొంటోంది. ఒక ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా మీపై ఎలాంటి ఒత్తిడి ఉంది? మీరు వ్యక్తిగతంగా ఎలా అధిగమిస్తున్నారు?

జ: నాపై ఉన్న విశ్వాసంతో ప్రధాని మోదీ ఈ కీలక బాధ్యతను అప్పగించారు. పరిస్థితులు ఎలా ఉన్నా.. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను. ఎప్పటికప్పుడు అవసరమైన సమావేశాలు నిర్వహిస్తూ నా బాధ్యతలకు కట్టుబడి ఉన్నా.

ఈ సంక్షోభ దశను దేశం సులువుగా అధిగమించేలా కృషి చేయటమే మా లక్ష్యం. మా సంస్కరణల ప్రక్రియ ద్వారా ఈ సవాలును అభివృద్ధి, భారత శ్రేయస్సు కొరకు అవకాశంగా మలుచుకుంటాం.

ఇదీ చూడండి: దేశీయ కంపెనీలకు రూ.50వేల కోట్ల ప్రోత్సాహకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.