రానున్న ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ వృద్ధి రేటు 10 శాతానికి పెరుగుతుందని బడ్జెట్లో అంచనా వేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20).. ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.8 శాతం నుంచి 3.5 శాతానికి కుదించారు ఆర్థిక మంత్రి. 2020-21లోనూ 3.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన మధ్యంతర సలహాలు స్వీకరించామన్నారు. కమిషన్ పూర్తి నివేదిక ఈ ఏడాది చివర్లో అందించే అవకాశముందని పేర్కొన్నారు.
వ్యయాలు, ఖర్చుల లెక్కలు..
ఆర్థిక సంవత్సరం | వ్యయం | ఆదాయం | నికర మార్కెట్ రుణాలు |
2020-21(అంచనా) | రూ.30.42 లక్షల కోట్లు | రూ.22.46 లక్షల కోట్లు | రూ.5.36 లక్షల కోట్లు |
2019-20 (సవరణ) | రూ.26.99 లక్షల కోట్లు | రూ.19.32 లక్షల కోట్లు | రూ.4.99 లక్షల కోట్లు |
ఇదీ చూడండి:'ఆ రూ.లక్ష కోట్ల ప్రాజెక్టులతో ఉపాధి సృష్టి'