ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకులకు లోనవుతోందని నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం... ఆర్థిక పునరుజ్జీవనం ఇప్పట్లో సాధ్యం కాదన్నారు. గత 5,6 సంవత్సరాల్లో, కొంత వృద్ధిని సాధించామని... ఇప్పుడు ఆ హామీ కూడా లేకుండా పోయిందని తెలిపారు.
ఆర్థిక శాస్త్రంలో ఆయనకు వరించిన అత్యుత్తమ పురస్కారం గురించి ప్రస్తావిస్తూ... ఇంత తొందరగా నోబెల్ వస్తుందని తాను ఊహించలేదన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేదరిక నిర్మూలనకు గత 20 ఏళ్లుగా పరిశోధన చేస్తున్నానని అభిజిత్ ఓ జాతీయ మీడియా సంస్థకు వెల్లడించారు.
ఇదీ చూడండి : మోదీ.. సంపన్నుల లౌడ్ స్పీకర్: రాహుల్