ETV Bharat / business

నేడే కేంద్ర వార్షిక బడ్జెట్​.. ప్రజా సంక్షేమానికి పెద్దపీట! - తాజా వార్తలు పద్దు

ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే. తీవ్ర మందగమనం వెంటాడుతోంది. సంస్కరణలెన్ని చేపట్టినా పెద్దగా ఫలితం లేదు. ఈ దశలో ఎన్డీఏ 2.0 ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్​ను నేడు ప్రవేశపెట్టనుంది. లోక్​సభ ఎన్నికల అనంతరం.. రాష్ట్రాల ఎన్నికల్లో డీలా పడిపోయిన భాజపాకు ఈ పద్దు ఎంతో కీలకం. అయితే.. మందగమనం నేపథ్యంలో ప్రజాకర్షణ మంత్రం జపించేందుకు అసలు అవకాశముందా? వ్యవసాయం, బ్యాంకింగ్​, రక్షణ, విద్య, వైద్యం తదితర రంగాల్లో ఎలాంటి సంస్కరణలు చేపట్టొచ్చు..?

nirmala-sitharaman
ఆశల పద్దు​: ప్రజాకర్షణ మంత్రమా? సంస్కరణల జపమా??
author img

By

Published : Feb 1, 2020, 5:23 AM IST

Updated : Feb 28, 2020, 5:53 PM IST

బడ్జెట్​... ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తెచ్చే వార్షిక ఖర్చు, జమ వివరాల పత్రం. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే సత్తా ఉన్న ఈ పద్దు​పై సాధారణంగానే ప్రజల దృష్టి ఉంటుంది. కానీ ఈ సారి బడ్జెట్​ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్డీఏ 2.0 ప్రవేశపెడుతోన్న మొదటి పూర్తిస్థాయి బడ్జెట్​తో పాటు... ప్రస్తుతమున్న ఉన్న రాజకీయ, ఆర్థిక స్థితిగతులే ఇందుకు కారణం. వరుసగా రాష్ట్రాల్లో అధికారం కోల్పోతున్న మోదీ సర్కారుకు ఈ బడ్జెట్ మరీ ముఖ్యం.

రాష్ట్రాలు కీలకం..

2019 లోక్​సభ సమరంలో సత్తా చాటిన కాషాయ పార్టీ ప్రాభవం క్రమంగా తగ్గుతూవచ్చింది. ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో డీలాపడింది. హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో కేవలం హరియాణాలోనే అధికారాన్ని కాపాడుకోగలిగింది భాజపా. అదీ ఇతర పక్షాల మద్దతుతోనే. ఇదే స్పష్టం చేస్తోంది ప్రజలను ఆకర్షించడానికి ఈ పద్దు ఎంత కీలకమో.

మరికొద్ది రోజుల్లో దిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీకి పోలింగ్​. వరుసగా రాష్ట్రాల్లో అధికారం కోల్పోతున్న భాజపాకు ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యం. ఇప్పటికే పౌరసత్వ చట్టం, ఎన్ఆర్​సీ, ఎన్​పీఆర్​ లాంటి వాటిపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు ఇలా పలు వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్నింటినీ అధిగమిస్తూ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకర్షించేలా బడ్జెట్​లో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవసరం ఉంది.

ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తారా?

దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా బడ్జెట్లు మాత్రం ఆశావహ చిత్రాన్ని ఆవిష్కరిస్తూనే ఉంటాయి. రాబోయే ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్​ కూడా ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. ఈసారి దేశాన్ని ఆర్థిక మందగమనం, నిరుద్యోగం వంటి సమస్యలు చుట్టుముట్టాయి. వీటన్నింటినీ అధిగమించి ప్రగతి బాట పట్టడమే ప్రస్తుత ప్రభుత్వం ముందున్న సవాల్​.

ఆర్థిక మందగమనంతో పాటు ఇటీవల ద్రవ్యోల్బణం కూడా ఐదేళ్ల గరిష్ఠాన్ని చేరింది. ప్రజల కొనుగోళ్లు తగ్గినందువల్ల పడిపోయిన వినియోగ డిమాండ్ ఇంకా గాడిన పడలేదు. వీటితో పాటు అనేక ఇతర కారణాలతో.. జీడీపీ వృద్ధి క్షీణిస్తోంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. పార్లమెంటులో శుక్రవారం ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ జీడీపీ 6 నుంచి 6.5 శాతం మేర వృద్ధి చెందుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. గతంలో ఈ వృద్ధి రేటు మరింత తగ్గొచ్చని అంచనా వేసిన ప్రభుత్వానికి ఈ ప్రకటన కాస్త సానుకూలాంశమే.

మళ్లీ సంస్కరణల జపం..!

ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్​ను ప్రవేశపెడుతోన్న దృష్ట్యా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సర్కారు మరిన్ని చర్యలు తీసుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలకు ఖర్చు పెట్టేందుకు అందుబాటులో ఉండే డబ్బును పెంచటం ద్వారా ఆర్థిక వ్యవస్థను ఊతమివ్వొచ్చు. ఇందుకోసం ఆదాయపు పన్నును తగ్గిస్తారని అందరూ భావిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

గ్రామీణ వినియోగ డిమాండ్ ప్రస్తుతం పడిపోయింది. మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనను పెంచేందుకు బడ్జెట్​లో భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వ్యవసాయం...

వ్యవసాయ రంగంలో అభివృద్ధి నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దేశ ఆర్థిక స్థితి కోణంలో.. వ్యవసాయ రంగంలో పలు కొత్త పథకాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాటితోపాటు ఇప్పటికే ఉన్న కొన్ని పాలసీల్లో మార్పులు అవసరమని ఆశిస్తున్నారు.

నిరుద్యోగ సమస్యపై...

నిరుద్యోగం... దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇదొకటి. ప్రస్తుతం నిరుద్యోగ రేటు 45 ఏళ్లలో గరిష్ఠమని నిపుణులు చెబుతున్నారు. స్వల్ప కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గించేందుకు ప్రభుత్వం... సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, కోల్డ్ స్టోరేజీలు, మార్కెట్ల నిర్మాణాలపై వ్యయాన్ని పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

'బ్యాంకింగ్​'లో ఉద్దీపనలు...

నిరర్ధక ఆస్తులు పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్యాంకింగ్ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు పరిష్కారంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, ప్రైవేటీకరణ మార్గాలను పరిశీలిస్తోంది. అయితే దీని వల్ల సమస్య మరింత జఠిలమయ్యే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ఆటంకాల్ని అధిగమిస్తూ ఎలాంటి ఉద్దీపనలు ప్రకటిస్తుందో వేచిచూడాలి.

ఈక్విటీలపై పన్ను.. కేంద్రం మాటేంటి?

స్టాక్​మార్కెట్లలో పెట్టుబడిదారులపై వసూలు చేసే దీర్ఘకాల మూలధన లాభాలపై కూడా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈక్విటీలపై పన్నును.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేట్ల స్థాయికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మోదీ ఇప్పటికే ప్రకటించారు. దీనితో పాటు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నుకు సంబంధించి కూడా ఈ పద్దులో చర్యలు తీసుకుంటారని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

జీఎస్టీ వసూళ్లు పెంచేలా..!

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఇటీవల బాగా తగ్గాయి. ఈ నేపథ్యంలో వాటిని పెంచుకునేందుకే బడ్జెట్​లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వొచ్చు. మనిషి ఆశాజీవి కనుక, బడ్జెట్లో కచ్చితంగా తమకు ఊరట కలిగించే నిర్ణయాలుంటాయని సామాన్యులు, వ్యాపారులు ఆశిస్తున్నారు.

ఇదీ చూడండి: 2018-19 వృద్ధి రేటు సవరణ- 6.1శాతానికి తగ్గింపు

ZCZC
PRI ESPL NAT
.NEWDELHI DES43
DL-NADDA-KEJRIWAL
Vote after comparing works done by Centre, AAP: JP Nadda
         New Delhi, Jan 31 (PTI) BJP president J P Nadda on Friday asked people to compare the works done by the Modi government and the AAP dispensation in Delhi, and decide whom to vote for in the February 8 assembly polls here.
         Addressing a gathering in Delhi's Ghonda area, Nadda alleged that the Arvind Kejriwal government has failed to fulfil its promises made in the run up to the 2015 assembly elections.
         The BJP president said the ruling Aam Aadmi Party had promised to construct 500 schools and 20 colleges, and provide clean water, but it failed to do so.
         On other hand, the BJP-led central government has done several works for the people of Delhi despite hurdles created by the AAP dispensation.
         The Modi government gave ownership rights to 40 lakh residents of 1,731 unauthorised colonies, he said, adding that the Centre will also provide pucca houses to every slum dweller.
         "I want to ask you that before going to cast your votes, see the work of any party in the past and then take decision," Nadda said.
         The central government constructed the Eastern and Western peripheral expressways due to which 60,000 vehicles do not need to enter Delhi, resulting in reduction in pollution level in the city.
         The AAP created hurdles in construction of Metro Phase-IV, but the Modi government ensured the smooth execution of the project, he said.
          Delhi goes to polls on February 8 and the results will be declared on February 11. PTI BUN BUN
ANB
ANB
01312156
NNNN
Last Updated : Feb 28, 2020, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.