ETV Bharat / business

'ఆ స్థాయికి ఎన్​డీబీ ఎదగాల్సిన అవసరముంది'

author img

By

Published : May 27, 2020, 11:10 PM IST

బ్రిక్స్ దేశాలు నెలకొల్పిన న్యూ డెవలప్​మెంట్ బ్యాంక్.. ప్రపంచ స్థాయి అభివృద్ధి సంస్థగా ఎదగాల్సిన అవసరముందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎన్​డీబీ బోర్డు సభ్యులతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

finance minister on ndb
ఎన్​డీబీ ఉపాధ్యక్షుడిగా భారతీయుడు

న్యూ డెవలప్​మెంట్ బ్యాంక్(ఎన్​డీబీ)​ ప్రపంచ స్థాయి సంస్థగా ఎదగాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. బ్రిక్స్ విలువలను పరిరక్షిస్తునే అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎన్​డీబీ బోర్డు గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు నిర్మలా. ఇందులో బ్యాంక్ ఉపాధ్యక్షుడు, చీఫ్ రిస్క్ అఫీసర్​గా అనిల్ కిషోరాను నియమించేందుకు ఆమోదం లభించింది.

nirmala Intraction with Ndb
వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడుతున్న సీతారామన్

ఈ సమావేశంలో న్యూ డెవలప్​మెంట్ బ్యాంక్​కు అధ్యక్షుడిగా సేవలందిస్తున్న భారతీయ బ్యాంకర్ కె.వి. కామత్​పైనా నిర్మలా ప్రశంసల వర్షం కురిపించారు. 2014లో బ్రిక్స్​ నేతలు నిర్దేశించిన స్థాయికి ఎన్​డీబీను అతి త్వరగా తీసుకెళ్లారని కొనియాడారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో వేగంగా స్పందించి.. కోవిడ్-19 అత్యవసర రుణ సదుపాయాన్ని ప్రారంభించడం ఆయన సేవల్లో గుర్తుండిపోయే కార్యక్రమమని సీతారామన్ చెప్పుకొచ్చారు.

త్వరలోనే ఐదేళ్ల పదవీ కాలం ముగించుకుని ఎన్​డీబీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు కామత్. 2015లో ఆయన ఎన్​డీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. కామత్ అనంతరం బ్రెజిల్​కు చెందిన మార్కోస్​ ట్రోయ్​జో ఆ పగ్గాలు చేపట్టనున్నారు.

ఇదీ చూడండి:దేశంలో నిరుద్యోగ రేటు 24.3 శాతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.