ETV Bharat / business

'2020లో భారత జీడీపీ క్షీణత 8.9 శాతం' - గ్లోబల్ మాక్రో ఔట్​లుక్ నివేదిక

2020లో స్థూల దేశీయోత్పత్తి 8.9 శాతం తగ్గనుందని 'మూడీస్​ ఇన్వెస్టర్స్ సర్వీస్' ఓ నివేదికలో పేర్కొంది. 2021లో వృద్ధి రేటు 8.6 శాతం పెరగనుందని అంచనా వేస్తోంది. కరోనా వైరస్​కు టీకా వచ్చాకే ప్రపంచ దేశాలు ఆర్థికంగా మెరుగవుతాయని తెలిపింది.

India GDP_Moody's
'2020లో భారత జీడీపీ క్షీణత 8.9 శాతం'
author img

By

Published : Nov 12, 2020, 4:55 PM IST

ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి 8.9 శాతం తగ్గొచ్చని 'మూడీస్​ ఇన్వెస్టర్స్ సర్వీస్'​ అంచనా వేసింది. లాక్​ డౌన్ ప్రభావం కారణంగా దేశ జీడీపీ 9.6 శాతం తగ్గొచ్చని గతంలో వేసిన అంచనాలను ఈమేరకు సవరించింది మూడీస్​.

2021 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8.1 శాతం పెరగొచ్చని గతంలో 'మూడీస్'​ అంచనా వేసింది. కానీ, ప్రస్తుతం దాన్ని 8.6 శాతానికి సవరించింది. ఈ మేరకు 2020-21 'గ్లోబల్​ మాక్రో ఔట్​లుక్' నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా విధించిన లాక్​ డౌన్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని నివేదికలో పేర్కొంది.

వ్యాక్సిన్​ వచ్చాకే....

వైరస్​ వ్యాప్తి రెండోసారి ఉద్ధృతంగా మారుతోన్న తరుణంలో పూర్తి స్థాయి ఆర్థిక వృద్ధి అంత సులభమేం కాదని 'మూడీస్' హెచ్చరించింది. కొవిడ్​ టీకా వచ్చాకే ప్రపంచ దేశాలు ఆర్థికంగా బలపడతాయని తెలిపింది.

ఇదీ చదవండి:'2020-21లో భారత జీడీపీ క్షీణత 8.6 శాతం'

'కొవిడ్ సురక్షా మిషన్​కు రూ.900 కోట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.