ETV Bharat / business

2020లో భారత వృద్ధి రేటు 5.3 శాతమే! - కరోనా అంచనాలు

భారత వృద్ధి రేటు 2020లో 5.3 శాతానికే పరిమితం కావొచ్చని రేటింగ్ ఏజెన్సీ మూడీస్​ అంచనా వేసింది. కరోనా నేపథ్యంలో వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తున్నట్లు పేర్కొంది.

corona effect on gdp
జీడీపీపై కరోనా ప్రభావం
author img

By

Published : Mar 17, 2020, 2:07 PM IST

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కొవిడ్-19​ భయాలతో భారత వృద్ధి రేటు అంచనాను తగ్గించింది రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్​ సర్వీస్. 2020లో భారత వృద్ధి రేటు 5.3 శాతానికి పరిమితం కావొచ్చని లెక్కగట్టింది. గత నెల విడుదల చేసిన అంచనాల్లో ఈ రేటును 5.4 శాతంగా ఉంచింది.

2020కి గాను మొదట 6.6 శాతంగా వృద్ధి రేటు అంచనా వేసింది మూడీస్​. అయితే పలు అనిశ్చితుల నడుమ వరుసగా అంచనాలను తగ్గిస్తూ వస్తోంది. గత ఏడాది (2019) 5.3 శాతంగానే వృద్ధి రేటు అంచనాలు ఉండగా.. 2018లో 7.4 శాతం వృద్ధి రేటు సాధించింది భారత్​.

ఇదే సమయంలో.. 2021లో భారత్​ 5.8 వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా వేసింది మూడీస్​.

మాంద్యం ముప్పు..

కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో అంతే వేగంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందని మూడీస్​ అభిప్రాయపడింది. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో వినియోగం భారీగా క్షీణిస్తోంది. దేశాల సరఫరా వ్యవస్థలూ ప్రభావితం అయ్యాయని పేర్కొంది. ఈ ప్రభావం ఎన్ని రోజులు కొనసాగితే ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యం వచ్చేందుకు అంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.

చమురు ధరలు క్షీణించడం కారణంగా చమురు ఎగుమతిదారులపై ఆర్థిక భారం, దిగుమతిదారులపై వాణిజ్య పరంగా ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు మూడీస్ అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:కరోనాపై పోరుకు ఫేస్​బుక్​, గూగుల్​, మైక్రోసాఫ్ట్​ టీమ్​వర్క్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.