ETV Bharat / business

'సంస్కరణలు కొనసాగిస్తే వృద్ధి పథం ఖాయం'

కొవిడ్ ప్రభావం నుంచి బయటపడాలంటే కీలకమైన సంస్కరణలు కొనసాగించాలని భారత్​కు ప్రపంచబ్యాంకు సూచించింది. సంస్కరణలను కొనసాగించడం ద్వారా భారత ఆర్థిక వృద్ధి తిరిగి 7శాతానికి చేరుకుంటుందని పేర్కొంది. కొవిడ్ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ పెంపొందించడానికి పలు సూచనలు చేసింది. ఈ మేరకు 'ఇండియా డెవలప్​మెంట్ అప్​డేట్' పేరిట నివేదిక విడుదల చేసింది.

Maintain reform momentum to reverse economic slowdown: World Bank
'సంస్కరణలు కొనసాగిస్తే వృద్ధి పథం ఖాయం'
author img

By

Published : Aug 19, 2020, 3:58 PM IST

కొవిడ్ ప్రభావం నుంచి బయటపడాలంటే కీలకమైన వైద్యం, ఆర్థికం, నైపుణ్యాల వంటి రంగాల్లో సంస్కరణలను కొనసాగించాలని భారత్​కు ప్రపంచ బ్యాంకు సూచించింది. ఈ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకతను పెంచి, ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ఉండాలని పేర్కొంది.

ఈ మేరకు భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాలను 'ఇండియా డెవలప్​మెంట్ అప్​డేట్​' రూపంలో ద్వైవార్షిక నివేదిక విడుదల చేసింది. గత ఆరు నెలల్లో భారత ఆర్థిక వ్యవస్థపై ఈ తాజా నివేదిక ప్రధానంగా దృష్టిసారించింది. ఆర్థిక విధానాలతో పాటు భారత్ అమలు చేస్తున్న సంస్కరణలపై లోతైన విశ్లేషణ చేపట్టింది.

"మౌలిక వసతులు, భూమి, శ్రమ, మానవ మూలధనం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే దేశాలు గ్లోబల్ వాల్యూ చైన్​కు అనుసంధానమై, అనిశ్చితులకు వెంటనే స్పందించగలుగుతాయి. ప్రపంచంలో జరిగే మార్పుల నుంచి ప్రయోజనాలను పొందగలుగుతాయి. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత్​కు ఈ అనిశ్చితులను ఎదుర్కొనే సామర్థ్యం లభిస్తుంది. మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడే సమయంలో మరింత పోటీతత్వంతో పనిచేసే అవకాశం వస్తుంది."

-జునైద్ అహ్మద్, వరల్డ్ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్- ఇండియా

ఈ సంస్కరణలను కొనసాగించడం ద్వారా భారత ఆర్థిక వృద్ధి తిరిగి 7 శాతానికి చేరుకుంటుందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. కొవిడ్ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ పెంపొందించడానికి పలు సూచనలు చేసింది. దేశ, విదేశాల్లో ఎంతవరకు రుణాలు తీసుకోవచ్చనే అంశాన్ని పునఃసమీక్షించాలని తెలిపింది. పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించింది.

ఆర్థిక రంగ స్థిరత్వం, ఎన్​బీఎఫ్​సీ వంటి రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టాలని నివేదిక పేర్కొంది. పెట్టుబడుల మార్కెట్​లో మరింత లోతైన సంస్కరణలు తీసుకురావాలని అభిప్రాయపడింది.

సంక్షోభమే అవకాశం

ప్రస్తుత సంక్షోభం.. డిజిటల్ సాంకేతికత, రిటైల్, వైద్య, విద్య-సాంకేతికతలు వంటి రంగాల్లో నూతన అవకాశాలకు తెరతీసిందని నివేదిక పేర్కొంది. ఈ అవకాశాలు భారత వృద్ధికి సమతుల్యతను అందిచగలవని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి- ఈ-కామర్స్​ విస్తరణకు రిలయన్స్ దూకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.