ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించిన 'ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన' పథకం మరో మైలురాయిని చేరుకోనుంది. ఈ ఖాతాల్లో డిపాజిట్లు వేగంగా రూ. లక్ష కోట్లకు చేరువవుతున్నాయి. ఏప్రిల్ 3 వరకు రూ. 97,665.66 కోట్ల నగదు జమ అయింది.
వారం క్రితం రూ. 95,382.14 కోట్లుగా ఉన్న నిల్వలు.. మార్చి 27 లోపల వేగంగా రూ.96,107.35 కోట్లకు చేరాయి.
ఈ పథకంలో మొత్తం 27.89 కోట్ల మందికి రూపే ఏటీఎం కార్డులు ఇచ్చారు. ఖాతాలున్న వారిలో 50 శాతం మహిళలే కావటం విశేషం. ఖాతాల్లో 59 శాతం సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతానికి చెందినవే.
ఆగస్టు 2018లో ప్రయోజనాల పెంపు...
2014, ఆగస్టు 28న ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ ఖాతాలతో పాటు ఇచ్చే ప్రమాద బీమాను 2018, ఆగస్టులో రూ. లక్ష నుంచి రెండు లక్షలకు పెంచారు. ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిని రూ.10 వేలకు పెంచారు.