ఎన్నికల వేళ భారత ఆర్థిక వ్యవస్థపై కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. గత ఐదేళ్లుగా అనేక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తామన్నారు. 28శాతంగా ఉన్న ఆహార పదార్థాలపై జీఎస్టీని 18 నుంచి 12కు తగ్గిస్తామని జైట్లీ ప్రకటించారు. సిమెంట్ ధరల్నీ తగ్గిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఎన్డీఏ-3లో ఆర్థిక వ్యవస్థ బలోపేతం, పన్ను రేట్లు తగ్గించడంపై దృష్టి సారిస్తామని జైట్లీ ప్రకటించారు.
"6శాతం ద్రవ్య లోటు యూపీఏ-2 ప్రభుత్వంలో ఉంది. ఇది ఐదేళ్ల సరాసరి ద్రవ్యోల్బణాన్ని 10శాతానికి పెంచింది. దీనివల్ల మేం గత ఐదేళ్లలో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్ని పెంచలేదు. జీఎస్టీ అనంతరం సైతం పన్ను రేట్లను తగ్గిస్తూ వచ్చాం. ఆదాయ పన్ను విషయంలోనూ ఇలాగే వ్యవహరించాం. పన్నును తగ్గించే విషయంలో మేం రెండు ఆలోచనలు చేశాం. మధ్యతరగతి వర్గాన్ని బలోపేతం చేయాలని సంకల్పించాం. ప్రజా వినియోగం పెరిగింది. వస్తువుల్ని కొనే విషయంలో వారికి స్వేచ్ఛనిచ్చాం. తక్కువ పన్నుల వల్ల పన్ను వసూళ్లు పెరిగాయి. ఈ నిధులతో గ్రామీణ భారతావని అభివృద్ధికి కృషి చేశాం. ఆయుష్మాన్ భారత్ పథకానికి నిధులు కేటాయించాం."
-అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి
స్థిరమైన వృద్ధి
అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉన్నా భారత వృద్ధి 7నుంచి 7.5 నమోదవుతూ వస్తోందన్నారు. దేశీయ వస్తు వినియోగం క్రమంగా పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
పన్నుపోటు లేదు
గత ఐదేళ్లుగా పన్నుల్ని పెంచలేదని తెలిపారు జైట్లీ. పన్ను బేస్‌ను తగ్గించడం ద్వారా పన్ను వసూళ్లు పెరిగాయన్నారు.
ఇదీ చూడండి:బెల్జియం ఒకటి... భారత్ నూటొక్కటి