ETV Bharat / business

ఆదాయపన్ను కోత అనివార్యమైతే.. వీటిపైనే ప్రభుత్వ దృష్టి! - ఆదాయ పన్ను లేటెస్ట్​ న్యూస్

ఆర్థిక మందగమన పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ముందున్న మార్గాల్లో ముఖ్యమైనది ఆదాయపన్ను తగ్గించడం. అయితే ఇప్పటికే పన్నుల నుంచి వచ్చే ఆదాయం తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుందా లేదా అనే సందేహాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయపన్ను తగ్గింపునకు ప్రభుత్వానికి ఉన్న అవకాశాలేంటి చూద్దాం!

incometax
ఆదాయ పన్ను
author img

By

Published : Jan 22, 2020, 10:54 AM IST

Updated : Feb 17, 2020, 11:15 PM IST

ప్రభుత్వం జీడీపీ వృద్ధి రేటును ముందుకు నెట్టాలంటే డిమాండ్‌ను పెంచాల్సిందే. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను మినహాయింపుపై మధ్యతరగతి జీవి ఎన్నో ఆశలు పెట్టుకొన్నాడు. కానీ, పన్ను ఆదాయం తగ్గిన సమయంలో మళ్లీ ఆదాయపు పన్ను ఉపశమనం ప్రకటిస్తుందా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే కార్పొరేట్‌ పన్ను తగ్గించడం కారణంగా భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో మరోసారి పన్ను ఉపశమనం ప్రకటించడం సాహసమే అవుతుంది. ప్రభుత్వం ఈ సాహసం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిద్దాం.

  • ప్రభుత్వం ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు చేయవచ్చు. చట్టంలోని 80సీ పరిధిని పెంచవచ్చు.
  • గృహరుణాల వడ్డీపై మినహాయింపును పెంచే అవకాశాలు దండిగా ఉన్నాయి. ఇది రెండువైపులా ప్రయోజనాలు ఉన్న నిర్ణయంగా నిలుస్తుంది. ఇది కొనుగోళ్లను పెంచి గృహ నిర్మాణ రంగంలో, రియల్‌ ఎస్టేట్‌ రంగానికి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రజల వద్ద నగదు మిగులు కూడా పెరుగుతుంది.
  • ఆదాయపు పన్ను మినహాయింపుల పెంపుతో ఏర్పడ్డ లోటును ప్రభుత్వం పరోక్ష పన్నుల పెంపుతో తీర్చుకోవచ్చు. జీఎస్టీ శ్లాబుల్లో స్వల్ప మార్పులతో దీనిని పూరించుకొనే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇచ్చే మినహాయింపుల మొత్తం జీఎస్‌టీ రూపంలో వెనక్కి వస్తుంది.

ఆదాయం లక్ష్యాలు గాడితప్పాయి..

ప్రభుత్వ ఆదాయ పన్ను ఉపశమనాలు పెద్దగా కల్పించకపోవచ్చు అన్న వాదన కూడా బలంగానే ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6.6లక్షల కోట్లను ఆదాయపన్ను రూపంలో, రూ.13.35లక్షల కోట్లను జీఎస్‌టీ రూపంలో వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, రెవెన్యూ లక్ష్యాలు రెండూ గాడితప్పాయి.

మరోపక్క కార్పొరేట్‌ పన్నురేట్లను తగ్గించి 15శాతం, 22శాతంగా నిర్ణయించాయి. దీంతో రూ.1.45లక్షల కోట్ల ఆదాయానికి గండిపడింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి మరోసారి ప్రభుత్వ ఆదాయంలో కోత విధించడానికి సిద్ధపడకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి:ఐదోతరం అపార ప్రయోజనం...భారత్‌లో '5జీ'సన్నాహాలు

Intro:Body:

dfgdfg

Conclusion:
Last Updated : Feb 17, 2020, 11:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.