లాక్‌డౌన్ నేపథ్యంలో బ్యాంకు రుణాల వడ్డీపై వడ్డీని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వివరణ ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ.. పంట, ట్రాక్టర్ రుణాలకు చక్రవడ్డీ మాఫీ పథకం వర్తించదని తెలిపింది.
వీటికి వర్తిస్తుంది..
ఫిబ్రవరి 29 నాటికి క్రెడిట్ కార్డు బకాయిలకు వర్తిస్తుందని తెలిపింది. వ్యక్తిగత, గృహ, వాహన, విద్య, వినియోగ, వృత్తిపరమైన రుణాలు సహా గృహ సంబంధ వస్తువులు, క్రెడిట్ కార్డు రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రంగానికి సంబంధించిన రుణాలకు మాత్రమే చక్రవడ్డీ మాఫీ వర్తిస్తుందని పేర్కొంది.
కోర్టు అదేశాల మేరకు ఈ నెల 23న.. ఆరు నెలల మారటోరియం కాలానికి రూ.2 కోట్ల లోపు రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నవంబర్ 5లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని బ్యాంకులకు సూచించింది.
ఇవీ చూడండి:
చక్రవడ్డీ మాఫీపై సందేహాలకు ఆర్థిక శాఖ స్పష్టత