ETV Bharat / business

పారిశ్రామిక ఉత్పత్తి భేష్- ద్రవ్యోల్బణం ఫ్లాట్ - మే పారిశ్రామిక ఉత్పత్తి

దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. మే నెలలో 29.3 శాతం వృద్ధి చెందింది. మరోవైపు, ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలలోనూ ఆర్​బీఐ నిర్దేశించుకున్న ప్రమాణాన్ని అధిగమించింది. జూన్​లో 6.26 శాతంగా నమోదైంది.

BIZ INFLATION
పారిశ్రామిక ఉత్పత్తి ద్రవ్యోల్బణం
author img

By

Published : Jul 12, 2021, 6:35 PM IST

భారత పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో 29.3 శాతం పెరిగింది. పారిశ్రామక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాల ప్రకారం ఈ నెలలో తయారీ రంగం 34.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. మైనింగ్ ఉత్పత్తి 23.3 శాతం పెరగ్గా.. విద్యుత్ ఉత్పత్తి 7.5 శాతం అధికంగా జరిగింది.

కరోనా కారణంగా గతేడాది మేలో ఐఐపీ 33.4శాతం పతనం కావడం గమనార్హం. 2020 మార్చి నుంచి ఐఐపీ తీవ్రంగా ప్రభావితమవుతూ వస్తోంది. కరోనా వల్ల 2020 ఏప్రిల్​లో 18.7 శాతం, ఏప్రిల్​లో 57.3 శాతం పతనమైంది.

ద్రవ్యోల్బణం ఇలా..

మరోవైపు, ద్రవ్యోల్బణం అదే స్థాయిలో కొనసాగుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం జూన్​లో 6.26 శాతంగా రికార్డైంది. అంతకుముందు నెలలో ద్రవ్యోల్బణం 6.3 శాతంగా ఉంది.

ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉంచాలని ఆర్​బీఐ నిర్దేశించుకోగా.. వినియోగదారుల ధరల సూచీ ప్రకారం.. వరుసగా రెండో నెలలోనూ ఇది ఆరు శాతానికి మించి నమోదైంది.

ఇదీ చదవండి: Flipkart: 2.8 లక్షల కోట్లకు ఫ్లిప్​కార్ట్ విలువ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.