పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) అల్ప స్థాయికి చేరి.. ఈ ఏడాది అక్టోబర్లో -3.8 శాతంగా నమోదైంది. విద్యుత్, గనులు, తయారీ రంగాల్లో బలహీన ప్రదర్శన ఇందుకు కారణంగా తెలుస్తోంది.
గత ఏడాది అక్టోబర్లో పారిశ్రామికోత్పత్తి 8.4 శాతం పెరగటం గమనార్హం.
రంగాల వారీగా లెక్కలివి..
- 2019 అక్టోబర్లో తయారీ రంగం ఉత్పత్తి 2.1 శాతం క్షీణించింది. గత ఏడాది ఇదే నెలలో 8.2 శాతం పెరిగింది.
- విద్యుత్ ఉత్పత్తి 2019 అక్టోబర్లో 12.2 శాతం తగ్గింది. 2018 అక్టోబర్లో 10.8 శాతం వృద్ధి చెందింది.
- గనుల రంగంలో ఉత్పత్తి ఈ ఏడాది అక్టోబర్లో 8 శాతం క్షీణించింది. గత ఏడాది పదో నెలలో 7.3 శాతం పెరిగింది.
ఇదీ చూడండి:నవంబర్లో మూడేళ్ల గరిష్ఠానికి చిల్లర ద్రవ్యోల్బణం