లాక్‌డౌన్ కారణంగా తయారీ రంగం, గనుల తవ్వకం, విద్యుత్ ఉత్పాదన మందగించి.. జూన్లో(గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే) పారిశ్రామికోత్పత్తి 16.6 శాతం తగ్గింది. కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.
పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ప్రకారం.. జూన్లో తయారీ రంగంలో 17.1 శాతం తగ్గుదల నమోదైంది. గనుల రంగంలో 19.8 శాతం, విద్యుత్ ఉత్పాదన రంగంలో 10 శాతం క్షీణత నమోదైంది.
నెలవారీ ప్రాతిపదికన మాత్రం ఐఐపీ భారీగా మెరుగైంది. ఏప్రిల్లో 53.6 వద్ద ఉన్న సూచీ.. మేలో 89.5 వద్దకు.. జూన్లో 107.8 వద్దకు పెరిగింది. అయితే లాక్‌డౌన్ సమయంలో గణాంకాలతో.. లాక్‌డౌన్ తర్వాతి లెక్కలను పోల్చడం సరికాదని కేంద్రం అభిప్రాయపడింది.
ఇదీ చూడండి:లాక్‌డౌన్ సడలించినా ఆఫీసుకు వెళ్లాలంటే భయమే!