గత ఏడాది డిసెంబర్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 0.3 శాతం క్షీణించింది. తయారీ రంగంలో మందగమనం ఇందుకు ప్రధాన కారణంగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
అంతకు ముందు ఏడాది (2018) డిసెంబర్లో ఐఐపీ 2.5 శాతం వృద్ధి సాధించింది.
అధికారిక డేటా ప్రకారం..
గత ఏడాది డిసెంబర్లో తయారీ రంగం ఉత్పత్తి 1.2 శాతం క్షీణించింది. 2018 డిసెంబర్లో ఈ రంగం 2.9 శాతం వృద్ధిని నమోదు చేసింది.
2019 డిసెంబర్లో విద్యుదుత్పాదన 0.1 శాతం తగ్గింది. అంతకు ముందు సంవత్సరం డిసెంబర్లో 4.5 శాతం వృద్ధి సాధించింది.
మైనింగ్ రంగం ఉత్పత్తి మాత్రం 2019 డిసెంబర్లో 5.4 శాతం పెరిగింది. 2018 డిసెంబర్లో ఈ రంగం ఉత్పత్తి 1 శాతం క్షీణించింది.
![IIP Statistics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6047055_iip.jpg)
ఇదీ చూడండి:జనవరిలో 7.59 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం