ETV Bharat / business

మూడు నెలల గరిష్ఠానికి తయారీ రంగ పీఎంఐ! - జులైలో తయారీ రంగ పీఎంఐ

దేశీయ తయారీ రంగం మూడు నెలల తర్వాత సానుకూల వృద్ధి రేటును నమోదు చేసింది. జులైలో తయారీ రంగ పీఎంఐ స్కోరు 55.3గా నమోదైనట్లు ఐహెచ్​ఎస్​ మార్కిట్​ నెలవారీ నివేదికలో ప్రకటించింది.

manufacturing sector sees strongest Growth
తయారీ రంగ వృద్ధి
author img

By

Published : Aug 2, 2021, 1:22 PM IST

కరోనా రెండో దశ సంక్షోభం తర్వాత దేశీయ తయారీ రంగం తొలిసారి భారీ వృద్ధి రేటును నమోదు చేసింది. డిమాండ్​ పెరగటం, స్థానిక ప్రభుత్వాలు కొవిడ్-19 ఆంక్షలు సడలించడం వంటివి ఇందుకు దోహదం చేసినట్లు ఐహెచ్​ఎస్​ మార్కిట్ నెలవారీ నివేదికలో పేర్కొంది.

ఈ సానుకూలతలన్నింటితో తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్​ (పీఎంఐ) స్కోరు జులైలో 55.3కు పెరిగింది. జూన్​లో ఇది 48.1 గా ఉండటం గమనార్హం.

పీఎంఐ స్కోరు 50కి పైగా ఉంటే వృద్ధి బాటలో ఉన్నట్లు.. అంతకన్నా తక్కువగా ఉంటే.. క్షీణత దశలో ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.

కరోనా ప్రభావం తగ్గుముఖం పడితే.. ఈ ఏడాది (2021) పారిశ్రామికోత్పత్తి 9.7 శాతానికి పెరగొచ్చని ఐహెచ్ఎస్​ మార్కిట్​ అంచనా వేసింది. తయారీ రంగంలో ఉద్యోగాల పరంగా చూస్తే.. స్వల్ప వృద్ధి నమోదైనట్లు వివరించింది.

ఇదీ చదవండి: 4 నెలల్లో రూ.31 లక్షల కోట్ల సంపద వృద్ధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.