ETV Bharat / business

తయారీ రంగ కార్యకలాపాలు రికార్డు స్థాయి పతనం

author img

By

Published : May 4, 2020, 6:22 PM IST

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్​డౌన్​తో తయారీ రంగ పీఎంఐ భారీగా తగ్గినట్లు ఐహెచ్​ఎస్​ మార్కిట్​ నివేదిక వెల్లడించింది. గత 15 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా పతనమైందని సర్వే పేర్కొంది.

pmi crisis In april
ఏప్రిల్​లో తయారీ రంగం కుదేలు

లాక్​డౌన్​ కారణంగా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది తయారీ రంగం. ఏప్రిల్​ నెలలో వృద్ధి.. ఎన్నడూ లేనంతగా క్షీణించినట్లు ఓ సర్వే వెల్లడించింది. ఈ సంక్షోభంతో కుదేలైన సంస్థలు.. ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయని పేర్కొంది.

ఐహెచ్​ఎస్​ మార్కిట్​ విడుదల చేసిన ఈ నివేదికలో.. ఏప్రిల్​లో తయారీ రంగం- పీఎంఐ(పర్చేసింగ్​ మేనేజర్స్​ ఇండెక్స్​) 27.4కు పడిపోయినట్లు తెలిసింది. మార్చిలో అది 51.8గా ఉండటం విశేషం. గత 15 సంవత్సరాల నుంచి పీఎంఐ డేటా సేకరణ జరుగుతుండగా.. ఈ స్థాయిలో పతనం నమోదు కావడం ఇదే తొలిసారి అని సర్వే పేర్కొంది.

దాదాపు 32 నెలల వృద్ధి తర్వాత పీఎంఐ సూచీ దిగువకు పడిపోయినట్లు సర్వే వెల్లడించింది.

కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. వ్యాపార కార్యకలాపాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ కారణంగానే ఏప్రిల్​లో డిమాండ్ భారీగా తగ్గిపోయింది. గడిచిన రెండున్నరేళ్లలో ఎప్పుడూ లేనంతగా కొత్త ఆర్డర్లు తగ్గిపోయాయని సర్వే తెలిపింది. తన చరిత్రలోనే ఇది ఎన్నడూ చూడనంత తక్కువ అని ఐహెచ్​ఎస్​ పేర్కొనడం గమనార్హం.

ఇదీ చూడండి:కరోనా వేళ దేశీయ ఫార్మాకు సువర్ణావకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.