దేశీయ తయారీ రంగ రికవరీ జోరు కాస్త తగ్గింది. నవంబర్లో మూడు నెలల కనిష్ఠానికి పడిపోయింది. ఫ్యాక్టరీల ఆర్డర్లు, ఎగుమతులు, కొనుగోళ్ల స్థాయి నెమ్మదించడం వంటివి ఇందుకు కారణంగా ఐహెచ్ఎస్ మార్కిట్ నెలవారీ నివేదికలో తెలిసింది.
ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక ప్రకారం.. తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ నవంబర్లో 56.3కు తగ్గింది. అక్టోబర్లో ఇది 58.9 వద్ద ఉంది. అయినప్పటికీ నవంబర్లోనూ తయారీ రంగ పీఎంఐ సానుకూల దశలోనే ఉండటం గమనార్హం.
మరిన్ని..
వ్యాపారాల ఆశావాద దృక్పథం నవంబర్లో తగ్గింది. ప్రభుత్వ విధానాలు, రూపాయి క్షీణత, కొవిడ్ వ్యాప్తి వంటివి వ్యాపారాల విశ్వాసాన్ని ప్రభావితం చేశాయి.
భౌతిక దూరం వంటి మార్గదర్శకాలతో.. కంపెనీల్లో ఉద్యోగకల్పన నవంబర్లోనూ కాస్త తగ్గింది.
ఇదీ చూడండి:ఎస్అండ్పీ చేతికి 'ఐహెచ్‌ఎస్'-2020లోనే అతిపెద్ద డీల్