ETV Bharat / business

కరోనా కుదిపేసినా అంకురాలు అదరహో! - స్టార్టప్​లను ప్రోత్సహించే పథకాలు

కరోనా సంక్షోభం గత ఏడాది కాలంగా అన్ని రంగాలను కుదిపేస్తోంది. అయినప్పటికీ దేశంలో అంకుర సంస్థల జోరు మాత్రం తగ్గడం లేదు. క్లిష్ట పరిస్థితులు కొనసాగుతున్నా.. ఆరు నెలల్లో 10 వేల అంకురాలు ప్రారంభమయ్యాయి. అంకురాలు గత ఆర్థిక సంవత్సరం 1.70 లక్షల ఉద్యోగాలను కల్పించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

10K Statups joined in last Six months in India
సంక్షోభంలోనూ చెదరని అంకురాల ధీమా
author img

By

Published : Jun 6, 2021, 1:52 PM IST

కరోనా సంక్షోభం దేశాన్ని కుదిపేస్తున్నా.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల స్ఫూర్తిని ఏ మాత్రం చెరపలేకపోయింది. గత ఆరు నెలల్లో కొత్తగా 10 వేల అంకురాలు ప్రారంభమవటమే ఇందుకు ఉదాహరణ. దేశంలో గుర్తింపు పొందిన దాదాపు 50 వేల స్టార్టప్​లలో 40శాతం కంపెనీలు గత 14 నెలల్లోనే కార్యకలాపాలు ప్రారంభించడం విశేషం.

కరోనా కారణంగా గత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.3శాతం క్షీణించింది. ఇంకా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త అంకుర సంస్థలు వ్యాపారాలు ప్రారంభించి ఉద్యోగ కల్పనకు తోడ్పడుతున్నాయి.

5.5 లక్షల మందికి ఉపాధి..

2020-21లో అంకురాలన్నీ 1,70,000 వేల ఉద్యోగాలను కల్పించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ లెక్కల ప్రకారం.. కొత్తగా ప్రారంభమైన అంకుర సంస్థలు ఒక్కొక్కటి.. కనీసం 11మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిసింది. ఇలా ఇప్పటి వరకు గుర్తింపు పొందిన 48,000 అంకురాలు 5,50,000 ఉద్యోగాలను సృష్టించినట్లు వెల్లడైంది.

సంక్షోభంలోనూ అంకురాల వృద్ధి..

అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016లో 'స్టార్టప్​ ఇండియా' పథకాన్ని ప్రారంభించారు. సరికొత్త ఆలోచనలతో, వినూత్న అవిష్కరణలతో ఔత్సాహికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత.. తొలి 10 వేల అంకురాలు నమోదయ్యేందుకు రెండేళ్ల సమయం పట్టింది. అయితే ఇప్పుడు కేవలం ఆరు నెలల్లోనే 10వేల కొత్త అంకారాలు ప్రారంభమయ్యాయి.

పథకం ప్రారంభమైన తొలి ఏడాది 743 అంకురాలు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు పొందాయి. కానీ గత ఆర్థిక సంవత్సరం 16 వేల అంకుర సంస్థలకు గుర్తింపు లభించింది. సంక్షోభం ఉన్నా అంకురాల వృద్ధి తగ్గలేదు అనే విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆ రంగాల్లోనే ఎక్కువ సంస్థలు..

ప్రభుత్వ గుర్తింపు పొందిన అంకురాల్లో ఎక్కువగా.. ఆహార శుద్ధి, ఉత్పత్తుల అభివృద్ధి, యాప్​ డెవలప్​మెంట్, ఐటీ, బిజినెస్​ సర్వీస్​ సపోర్ట్ వంటి విభాగాల్లోనే ఎక్కువగా ఉన్నాయి.

అంకురాలు స్థాపించిన ఔత్సాహికుల్లో 45 శాతం మంది మహిళలే కావడం మరో విశేషం. ఇది మరింత మంది మహిళలను ప్రేరేపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

ఎక్కువ అంకురాలు అక్కడే..

మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, ఉత్తర్​ ప్రదేశ్​, గుజరాత్​ వంటి రాష్ట్రాల్లోనే అధిక సంఖ్యలో అంకురాలు ఉన్నాయి.

అంకురాలను ప్రోత్సహించే విధంగా 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రత్యేక పాలసీలను తీసుకువచ్చాయి.

నిధులు సమకూరేది ఇలా..

ఫండ్​ ఆఫ్​ ఫండ్స్​ స్కీమ్​ (రూ.10 వేల కోట్లు), కేంద్రం ఇటీవల విడుదల చేసిన సీడ్ ఫండ్ స్కీమ్​తో (రూ.945 కోట్లు) అంకురాలకు నిధులు సమకూరే అవకాశాలు పెరిగాయి.

దీనికి తోడు డిపార్ట్ ఫర్​​ ప్రమోషన్​ ఆఫ్​ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్​ (డీపీఐఐటీ) కూడా.. నేషనల్​ స్టార్టప్​ అవార్డ్​, స్టేట్​ ర్యాంకింగ్ ఫ్రేమ్​వర్క్​, గ్లోబల్ వీసీ సమిట్​, ప్రారంభ్​, స్టార్టప్​ ఇండియా ఇంటర్నేషనల్​ సమిట్​ వంటి కార్యక్రమాలతో అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం సహా నిధులు సమకూర్చుకునే అవకాశాలు కల్పిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.