అమెరికా దిగుమతులపై సుంకాల పెంపును భారత్ మరోసారి పొడిగించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే 29 ఉత్పత్తులపై సుంకాల పెంపు నిర్ణయాన్ని మే 16కు బదులుగా జూన్ 16 నుంచి అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
2018 జూన్ నుంచి ఇప్పటికే పలు మార్లు గడువు పొడిగిస్తూ వస్తోంది భారత్.
సుంకాల పెంపు ఎందుకంటే..
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం వంటి వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచుతూ అమెరికా గతేడాది నిర్ణయం తీసుకుంది.
దుకు ప్రతీకార చర్యగా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న బాదం, వాల్నట్స్ సహా 29 ఇతర ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పొడిగించాలని 2018 జూన్‌లో నిర్ణయించింది భారత్.
జీఎస్పీ అమలయ్యేనా?
జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్పీ) కింద భారత్‌కు ఇస్తున్న ఎగుమతుల ప్రోత్సాహకాన్ని అమెరికా రెండు నెలల క్రితం ఉపసంహరించుకుంది. ఈ ప్రభావం భారత్ నుంచి అమెరికాకు ఎగుమతవుతున్న 5.6 బిలియన్ డాలర్లు విలువైన వస్తువులపై పడింది.
జీఎస్పీ అమలు సహా పలు ఇతర అంశాలపై ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. చర్చల్లో భాగంగా భారత్ వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు, అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రోస్ మే 6న సమావేశమయ్యారు.
ఇరు దేశాల డిమాండ్లు
అల్యూమినియం, వ్యవసాయ ఉపకరణాలు, ఆటోమొబైల్ సహా వాటి విడి భాగాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని అమెరికాను భారత్ డిమాండ్ చేస్తోంది.
వ్యవసాయ పనిముట్లు, పాల ఉత్పత్తులు, వైద్య పరికరాలు, ఐటీ, సాంకేతిక వస్తువులపై సుంకాలను తగ్గించాలని భారత్‌ను అమెరికా కోరుతోంది. వీటిపై నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.
వాణిజ్య గణాంకాలు సానుకూలం
భారత్ నుంచి అమెరికాకు 2017-18లో 47.9 బిలియన్ డాలర్లు విలువైవ ఎగుమతులు జరిగాయి. అదే సమయంలో అమెరికా నుంచి 26.7 బిలియన్ల డాలర్లు విలువైన దిగుమతులు నమోదయ్యాయి. ఈ వాణిజ్య గణాంకాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇదీ చూడండి: 'వన్ ప్లస్' కొత్త మోడళ్లు వచ్చేస్తున్నాయ్