వ్యాపార అవకాశాల బలపేతం, పెట్టుబడుల ప్రోత్సాహానికి భారత్ ప్రయత్నాలు ఫలించినట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) వెల్లడించింది. అయితే సమగ్ర వృద్ధి కోసం భారత్‌కు మరిన్ని ఆర్థిక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది.
ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు గూగుల్, ఫేస్బుక్ సహా ఇతర సంస్థలు భారత్‌లో దాదాపు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది మొత్తం మీద 40 బిలయిన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తాయని అంచనాలు ఉన్నాయి. దీనిపై స్పందిస్తూ ఐఎంఎఫ్ భారత్‌కు తాజా సూచనలు చేసింది.
మెరుగైన ర్యాంకు..
కొత్త దివాలా చట్టం, జీఎస్టీ వంటి సంస్కరణలతో భారత వ్యాపార ర్యాంకింగ్ మెరుగైనట్లు ఐఎంఎఫ్ ప్రతినిధి జెర్నీ రైస్ పేర్కొన్నారు. వీటి కారణంగా ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో 2018లో భారత్ ర్యాకింగ్ 100 గా ఉంటే 2020లో 63కు పెరిగినట్లు గుర్తు చేశారు.
'ఏదేమైనప్పటికీ.. మా దృష్టిలో భారత్‌కు మరిన్ని ఆర్థిక, కార్మిక, భూ సంస్కరణలు అవసరం. మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు కూడా ముఖ్యం. వీటితోనే సుస్థిర వృద్ధి సాధ్యమవుతుంది' అని గారీ రైస్ అన్నారు.
వృద్ధి అంచనాలు..
ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. భారత వృద్ధి రేటు 2020-21లో కరోనా సంక్షోభంతో -4.5 శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్ లెక్కగట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో తిరిగి ఆరు శాతం రికవరీ సాధిస్తుందని అంచనా వేసింది.
ఇదీ చూడండి:2021-22లో 6.7 శాతానికి భారత వృద్ధి రేటు!