ETV Bharat / business

'ఆర్థిక వృద్ధికి భారత్​ చర్యలు బాగున్నాయి. కానీ!' - భారత్ ఆర్థిక మందగమనం

వృద్ధికి ఊతమందించే దిశగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తెలిపింది. అయితే ప్రస్తుతం నెలకొన్న మాంద్యం భయాలతో.. మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది. ఈ ఏడాది వృద్ధి కాస్త తగ్గినా.. భవిష్యత్తు​ అశాజనకంగా ఉన్నట్లు వెల్లడించింది.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ
author img

By

Published : Oct 18, 2019, 2:02 PM IST

ఆర్థిక మందగమనం నేపథ్యంలో భారత్.. కొన్ని ప్రాథమిక అంశాల పరిష్కరానికి కృషి చేసిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్​) పేర్కొంది. అయినప్పటికీ భారత్​ ముందు ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయని వెల్లడించింది. ఐఎంఎఫ్​ ఇటీవలే భారత వృద్ధి అంచనాను 90 బేసిస్ పాయింట్లు తగ్గించి.. 6.1 శాతానికే పరిమితం చేయడం గమనార్హం.

పరిష్కారం లభించని వాటిలో ముఖ్యంగా బ్యాంకింగేతర ఆర్థిక రంగాలు ఉన్నట్లు ఐఎంఎఫ్ తెలిపింది. అయితే భారత్​ తీసుకున్న బ్యాంకుల విలీనం వంటి నిర్ణయాలతో ఈ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముందని ఐఎంఎఫ్​ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియెవా అన్నారు. ప్రస్తుతం వృద్ధికి ఊతమందించే ధీర్ఘకాలిక అంశాలపై భారత్​ దృష్టి సారించాలని పేర్కొన్నారు. మానవ వనరులపై పెట్టుబడులు ఎంతో అవసరమన్నారు.

ప్రతిభ గల మహిళలు ఇంట్లోనే ఉంటున్నారు...

శ్రామిక రంగాల్లోకి మహిళలను తీసుకురావాలని క్రిస్టలినా సూచించారు. భారత్​లో ప్రతిభ గల మహిళలు ఎంతో మంది ఉన్నా.. వారు ఇళ్లకే పరిమితమవుతున్నారని విచారం వ్యక్తం చేశారు.

గత కొన్నేళ్లుగా భారత్ వృద్ధి గణనీయంగా ఉందని.. భవిష్యత్​లోనూ వృద్ధి కొనసాగుతుందని అశిస్తున్నట్లు క్రిస్టలినా పేర్కొన్నారు. వృద్ధి కొనసాగించేందుకు నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని.. భవిష్యత్​లో భారత్​ వాటిని పాటిస్తుందని ఐఎంఎఫ్ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి: రిలయన్స్​ రికార్డ్​... రూ.9 లక్షల కోట్లకు ఎం-క్యాప్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: New Otani Hotel, Tokyo, Japan - 18th October 2019.
1.++FULL SHOTLIST & SCRIPT TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 05:12
SCRIPT:
Head coach Jamie Joseph and captain Michael Leitch both believe there is a real confidence and self-belief in their Japan side, as they prepare to face South Africa in their Rugby World Cup quarter-final on Sunday in Tokyo.
++MORE TO FOLLOW++
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.