India GDP 2021-22: వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని 2021-22 ఆర్థిక సర్వేలో అంచనా వేయనున్నారు. ఈసారి ఆర్థిక సర్వేను ఒకే పుస్తకంగా ఆర్థిక శాఖ తీసుకువస్తుందని భావిస్తున్నారు. సాధారణ బడ్జెట్‌కు ముందు పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి సర్వేను విడుదల చేస్తారు. ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) గైర్హాజరులో ప్రధాన ఆర్థిక సలహాదారు, ఇతర అధికారులు ఈ సారి ఆర్థిక సర్వేను రూపొందిస్తున్నారు. 2014 జులైలో మోదీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన మొదటి ఆర్థిక సర్వేను సీనియర్ ఆర్థిక సలహాదారు ఇల పట్నాయక్ రూపొందించారు. అప్పటికి సీఈఏ పదవి ఖాళీగా ఉంది. 2014 అక్టోబరులో సీఈఏగా అరవింద్ సుబ్రమణియన్ నియమితులయ్యారు. ఇక గతేడాది డిసెంబరు 6న కేవీ సుబ్రమణియన్ మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోగా.. కొత్త సీఈఏను నియమించే పనిని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది.
- జాతీయ గణక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ముందస్తు అంచనాల ప్రకారం.. 2021-22లో జీడీపీ వృద్ధి 9.2 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) 9.5 శాతం వృద్ధి అంచనా కంటే ఇది తక్కువే.
- బేస్ ఎఫెక్ట్ కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వృద్ధి నమోదుకావొచ్చని సర్వే అంచనా వేయనుంది. గతేడాది జనవరిలో విడుదలైన 2020-21 ఆర్థిక సర్వేలో.. 2021-22లో 11 శాతం వృద్ధిని అంచనా వేశారు.
ఇదీ చదవండి: